Begin typing your search above and press return to search.

కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌లుపు నీళ్లు తాగుతోంది!

By:  Tupaki Desk   |   24 Sep 2022 5:12 AM GMT
కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌లుపు నీళ్లు తాగుతోంది!
X
మినరల్‌ వాటర్‌ తెలుసు.. రోజ్ వాటర్‌ తెలుసు .. మ‌రి ఈ బ్లాక్‌ వాటర్‌ ఏంటి అంటారా? అంటే ఇదీ మంచి నీరే. అంద‌రూ తాగ‌ద‌గినదే. ఈ మధ్య కాలంలో ఈ వాటర్‌కి బాగా డిమాండ్‌ పెరిగింది. సెలిబ్రిటీలు ఈ వాటర్‌ని తాగేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీ.. హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.

ఇటీవ‌లే వీళ్ల జాబితాలోకి బాలీవుడ్ న‌టి మ‌లైకా ఆరోరా సైతం చేరింది. ఈ భామ కూడా న‌వ నాయిక‌లా వెలిగిపోవాల‌ని న‌లుపు నీళ్లు తాగ‌డం మొద‌లు పెట్టింది. తాజాగా ఈ వ‌రుస‌లో చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా చేరింది. అమ్మ‌డి చేతిలో బ్లాక్ క‌ల‌ర్ వాట‌ర్ కనిపించడంతో? ఈ న‌లుపు నీళ్లేంట‌ని రిపోర్ట‌ర్లు ప్ర‌శ్నించ‌గా..ఆ నీటి ప్ర‌త్యేక‌గ‌త గురించి ఇలా చెప్పుకొచ్చింది.

' ఇది మంచి నీరే. నేను చాలా రోజుల నుంచి ఇదే నీరు తాగుతున్నాను. ఇది జీర్ణ‌క్రియ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని' చెప్పుకొచ్చింది. ఆల్కలీన్ వాట‌ర్ గా పిలిచే ఈ నీరు తాగితే జీర్ణ‌క్రియ మెరుగ‌వ్వ‌డంతో పాటు.. వ‌య‌సుపైబ‌డే ఛాయ‌లు త‌గ్గుతాయ‌ని ఆయా కంపెనీలు ప్ర‌మోట్ చేస్తున్నాయి. దీంతో సెల‌బ్రిటీలు అదే స్థాయిలో ఎగ‌బ‌డుతున్నారు.

ఈ విష‌యం తెలియ‌డంతో సోష‌ల్ మీడియాలో బ్లాక్ వాట‌ర్ గురించి పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. బ్లాక్‌ వాటర్‌ స్పెషల్‌ ఏంటి? ఈ నలుపు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాటర్‌ ధర ఎంత? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. సాధార‌ణంగా మ‌నం తాగే మిన‌ర‌ల్ వాట‌ర్ ఖ‌రీదు లీట‌ర్‌కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ ల‌భిస్తుంది.

లీటర్‌ బ్లాక్‌ వాటర్‌ బాటిల్‌కు దాదాపు రూ. 100 ఉంటుందట. ఈ వాటర్‌లో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీట‌ర్ బ్లాక్ వాట‌ర్‌లో 70 మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తాయి.

ఈ వాటర్‌ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్‌ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.