Begin typing your search above and press return to search.

తమిళ్ లో మాత్రమే ఎందుకు నొక్కారు?

By:  Tupaki Desk   |   23 Dec 2018 12:08 PM GMT
తమిళ్ లో మాత్రమే ఎందుకు నొక్కారు?
X
ఏదైనా వైరల్ కావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంట్రోవర్సిని మించింది లేదు. ముఖ్యంగా సినిమా పబ్లిసిటీ కోసం దీన్ని రకరకాలుగా వాడుతున్న దర్శక నిర్మాతలెందరో ఉన్నారు. అయితే క్వీన్ రీమేక్ విషయంలో మాత్రం ఇది కాస్త వెరైటీగా ఉండటం కొత్త చర్చకు దారి తీస్తోంది. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తమిళ్ సినిమా పారిస్ పారిస్ టీజర్ లో కాజల్ వక్షాన్ని ఆర్టిస్ట్ అల్లి ఎవ్రం నొక్కి పట్టడం విపరీతంగా వైరల్ అయిపోయింది. దాని తాలుకు స్క్రీన్ షాట్లు వీడియో బిట్లు జిఐఎఫ్ ఇమేజీలు ఒకటేమిటి నానా రకాలుగా ఇష్టం వచ్చినట్టు చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి టీజర్ లో ఉన్న మిగలిన విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాజల్ అగర్వాల్ ఎంత అందంగా ఉన్నా అది వదిలేసి దీన్నే తదేకంగా చూస్తున్నారు. ఇదే కాజల్ ఫ్యాన్స్ ని యమా ఇబ్బంది పెడుతోంది. అయితే మరో విషయంలోనూ తమిళ ప్రేక్షకులు దీని మేకర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వీన్ రీమేక్ మొత్తం నాలుగు బాషలలో రూపొందిన సంగతి తెలిసిందే. అయితే హీరొయిన్లు వేర్వేరు. వాటి టీజర్ లు కూడా దీంతో పాటు ఒకేసారి రిలీజ్ చేసారు. వాటి రెస్పాన్స్ సోసోగా ఉంది. అయితే విచిత్రంగా మిగలిన కన్నడ, మలయాళం, తెలుగు టీజర్స్ లో ఈ బ్రెస్ట్ ప్రెస్సింగ్ సీన్ లేదు.

అంటే కావాలనే తమిళ్ వెర్షన్ లో మాత్రమే ఎందుకు ఉంచారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాజల్ అగర్వాల్ ఒకటే ఒప్పుకుని మిగిలిన వాళ్ళు అభ్యంతర పెట్టారా లేక వాటిని ఇది చల్లారక విడుదల చేస్తారా అంటూ అడుగుతున్నారు. దీనికి సమాధానం వెంటనే దొరికే ఛాన్స్ లేదు. కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ మాత్రం ఈ పరిణామం పట్ల బాగా హర్ట్ అయిపోతున్నారు. అసలు మా హీరొయిన్ ని ఇలా నొక్కుడు సీన్ లో చూపించి అవమానిస్తారా అంటూ యమా ఫీలైపోతున్నారు. ఒకేవేళ నాలుగు టీజర్స్ లో ఇదే ఉంటె సమస్య ఉండేది కాదు కాని ఒకదాంట్లోనే ఉండటం చిక్కు తెచ్చి పెట్టింది.