Begin typing your search above and press return to search.
నాలుగు భాషల్లోనూ ఆ చాన్స్ వచ్చిందట, కాని..
By: Tupaki Desk | 6 Dec 2018 5:57 AM GMTతెలుగు తమిళం లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ కాజల్ కెరీర్ చాలా జోరుమీదుంది. తాజా గా ఈమె తెలుగు లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘కవచం’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు తమిళం లో ‘క్వీన్’ రీమేక్ లో నటిస్తోంది. ఇంకా తమిళం లో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఇండియన్ 2’ లో కూడా ఈమె నటించబోతున్నట్లుగా దాదాపు గా క్లారిటీ వచ్చింది. కవచం విడుదల కాగా నే క్వీన్ రీమేక్ తో ఈమె వచ్చే అవకాశాలున్నాయి.
తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న కాజల్ ఎందుకు కేవలం తమిళం లో మాత్రమే క్వీన్ రీమేక్ చేస్తుందనే అభిప్రాయం కొందరి లో వ్యక్తం అవుతుంది. తమిళం లో మాత్రమే క్వీన్ రీమేక్ కు సంబంధించి కాజల్ మాట్లాడుతూ.. మొదట సౌత్ లోని నాలుగు భాషలకు కూడా కలిపి నన్ను క్వీన్ రీమేక్ కు అనుకున్నారు. టెస్ట్ షూట్ కూడా జరిపారు. అంతా ఓకే అనుకున్న తర్వాత తెలుగు మరియు తమిళం లో మాత్రమే నన్ను తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత తమిళం కే పరిమితం చేశారంటూ చెప్పుకొచ్చింది.
చిత్ర యూనిట్ సభ్యుల నిర్ణయం కు కారణం ఏంటో చెప్పని కాజల్, నాలుగు భాషల్లో నటించక పోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. నాలుగు భాషల్లో కూడా నటిస్తే తప్పకుండా చాలా ఇబ్బంది ఎదురయ్యేది, ఏ భాష లో కూడా పూర్తి న్యాయం చేసేదాన్ని కాదేమో అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. క్వీన్ చిత్రం లో హీరోయిన్ పాత్ర చాలెంజింగ్ రోల్. అలాంటి పాత్రను నాలుగు భాషల్లో పోషించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు అలా చేయక పోవడం మంచిదని అంతా భావిస్తున్నామంది. చాలా కాలంగా షూటింగ్ కొనసాగుతూనే ఉన్న క్వీన్ త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలున్నాయి. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులు ఈ చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ ను పెట్టారు. తమిళంలో మాత్రం ఈ రీమేక్ కు ‘పారిస్ పారిస్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.