Begin typing your search above and press return to search.
ఈ కాజల్ స్లొవేనియా ఎందుకు వెళ్తున్నట్లో..
By: Tupaki Desk | 1 Aug 2016 8:18 AM GMTఎప్పుడూ వార్తల్లో ఉండాలంటే ఎలా? ఒకప్పుడు సమంత ఈ ట్రిక్ బాగా ఫాలో అయ్యేది. అందుకే ఈజీగా టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఇప్పుడు ఇదే పద్దతిని ఆమెకంటే ముందే స్టార్ హీరోయిన్ అయిపోయిన కాజల్ కూడా పాటిస్తోందండోయ్. పదండి చూద్దాం.
నిజానికి సర్దార్ అండ్ బ్రహ్మోత్సవం రిజల్టు వచ్చాక ఇక కాజల్ పనైపోయింది అనుకున్నాం. కట్ చేస్తే అమ్మడు ఓ రెండు తమిళ సినిమాలు సైన్ చేసింది. ఈ అప్డేట్లతో సినీలోకాన్ని హోరెత్తిస్తోంది. అందులో ఏకంగా జీవాతో చేస్తున్న కావలై వేండమ్ సినిమా గురించి అప్డేట్లు మామూలుగా ఇవ్వలేదు. పొట్టి గౌనులో ఎగురుతూ వీడియోలో.. స్విమ్మింగ్ పూల్ పక్కనే బికినీ టాపులో దర్శనమిస్తూ ఒక సాంగు గురించి ఇచ్చిన లీకులు.. అదిరిపోయాయ్. ఇక మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా రేసులో ఉన్నానంటూ హడావుడి చేయడం.. ఆ సినిమాలో ఈమె ఉందంటూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చినా తను మాత్రం ఏదీ ఓపెన్ గా చెప్పకపోవడం.. ఇలా జనాల నోళ్ళలో ఏదో విధంగా నానుతూనే ఉంది కాజల్. కట్ చేస్తే.. ఇప్పుడు అమ్మడు స్లోవేనియా అనే దేశం వెళుతోంది. అజిత్ సరసన చేస్తున్న సినిమా తాలూకు పాటలను చిత్రీకరించడానికి అక్కడకు వెళ్తున్నారట.
మరి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ అన్నారు.. ఆ సినిమా కోసం ఈవిడ డేట్లు అప్పుడే అవసరం లేదా? ఇప్పుడు ఇలా ఫారిన్ కంట్రీ చెక్కేస్తే ఇక మెగా షూటింగులో పాల్గొనేదెప్పుడు డియర్!!