Begin typing your search above and press return to search.
కమింగ్ సూన్ అంటోన్న కాజల్!!
By: Tupaki Desk | 13 March 2017 6:44 AM GMTకాజల్ అగర్వాల్ కెరీర్ ఇప్పుడు ఊపు మీదే ఉంది. ఖైదీ నంబర్ 150 తో కెరీర్ లో అతి పెద్దహిట్.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కాజల్ కి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతోన్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ భామ.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. కమింగ్ సూన్ అంటూ జనాలను ఊరిస్తోంది. పక్కనే ఉన్న రానా భుజాలపై చేతులు వేసుకుని కూర్చున్న కాజల్.. సైడ్ యాంగిల్ నుంచి ఈ ఫోటోలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది కాజల్. ఈ ఫోటో స్పెషల్ ఏంటంటే.. మెడలో తాళి కూడా కనిపించేలా సూపర్బ్ గా ఈ ఫోటో తీశారు. అంటే ఈ చిత్రంలో తను రానా దగ్గుబాటికి భార్యగా నటిస్తోన్న విషయం చెప్పేందుకే ఈ ఫోటో షేర్ చేసింది చందమామ.
నేనే రాజు నేనే మంత్రి టైటిల్ పై పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు తేజ.. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ అత్యంత జాగ్రత్తగా పిక్చరైజ్ చేస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/