Begin typing your search above and press return to search.

కాజల్.. ఏంటి మ్యాటర్? ఎవరతను?

By:  Tupaki Desk   |   15 Nov 2017 1:03 PM GMT
కాజల్.. ఏంటి మ్యాటర్? ఎవరతను?
X
టాలీవుడ్ చందమామ కాజల్ సినిమా సినిమాకి చాలా స్పెషల్ గా కనిపిస్తుందనే చెప్పాలి. తన అందంతో అమ్మడు కుర్రకారుకు పిచ్చెత్తిస్తోంది. ఇక ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను చేసిన కాజల్ ఏనాడు నెగిటివ్ కామెంట్స్ ను తెచ్చుకోలేదు. అంతే కాకుండా రూమర్స్ కూడా అంతే పెద్దగా ఏమి రాలేదు. దాదాపు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోంది.

అయితే అమ్మడిపై ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కూడా ఆమె సోషల్ మీడియాలో ఒక స్పెషల్ ఫొటోని పోస్ట్ చేయడం. కాజల్ కొన్ని ఫ్లవర్స్ ని చేతిలో పట్టుకొని ఉన్న ఫొటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫ్లవర్స్ నాకు పంపించడంతో నువ్వు చాలా మిస్ అవుతున్నవ్ అనే భావన కలుగుతోంది అనేలా అమ్మడు కామెంట్ చేసింది.

దీంతో కాజల్ ని అంతగా ఎవరు మిస్ అవుతున్నారు అనేలా మన నెటిజన్స్ కూడా కొన్ని అనుమానాలతో కూడిన కామెంట్స్ చేశారు. ఎప్పుడు లేనిది కాజల్ ఇలా ఫ్లవర్స్ ఫోటోని ఇంత స్పెషల్ గా పోస్ట్ చేసింది అంటే ఎదో మ్యాటర్ ఉందంటున్నారు నెటిజన్స్. అంతే కాకూండా అతనెవరు అంటున్నారు. మరి ఈ కామెంట్స్ కు కాజల్ ఏమైనా సమాధానం ఇస్తుందో లేదో? ఇస్తే ఓ క్లారిటీ ఉంటుంది. కానీ ఇవ్వకుంటేనే కన్ఫ్యూజన్ లో ఎక్కువ రూమర్స్ వస్తాయ్ మరి.