Begin typing your search above and press return to search.
కాజల్ వారి 'చందమామ కథలు'
By: Tupaki Desk | 24 Oct 2016 4:34 AM GMTప్రతీ వాళ్లకు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. సెలబ్రిటీలు స్టార్లు అయినంత మాత్రాన ఏ బలహీనత ఉండదు అనుకోవడం పొరపాటు. కానీ కొంతమంది మాత్రం తమ వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా మార్చేసుకుంటూ ఉంటారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి టూర్లు కొట్టేయడం అంటే మహా ఇష్టం. సినిమా షూటింగ్స్ లో భాగంగానే కాదు.. విడిగా చిన్న గ్యాప్ వచ్చిందంటే చాలు.. ఏదో ఒక కొత్త ప్లేస్ కి ఎగిరిపోతూ ఉంటుంది.
కనీసం 2-3 నెలలకోసారైనా కొత్త ప్లేస్ కి వెళ్లకపోతే కాజల్ కి బాగా వెలితిగా ఉంటుందట. ఎక్కువగా చెల్లెలు నిషా అగర్వాల్ ని తోడు పెట్టుకునే టూర్స్ ప్లాన్ చేసుకునే చందమామ.. ఫ్యామిలీ- ఫ్రెండ్స్ తో కలిసి కూడా విహారాలకు వెళ్లిపోతూ ఉంటుంది. కాసింత టెన్షన్ అనిపించినా సరే బాలీ దీవుల్లో వాలిపోతుందట ఈ భామ. కౌలాలంపూర్ లో ప్రైవేట్ జెట్ ని నడిపేసిన థ్రిల్ ఈ జన్మంతా మరిపోలేనని ఆనందంగా చెప్పేస్తోంది. ఇప్పటికే నార్త్ ఇండియా అంతా కవర్ చేసేశానని.. ఫారిన్ టూర్స్ వెళితే షాపింగ్ చేస్తానని.. అమెరికాలో చెప్పులు.. ఫ్రాన్స్ లో డ్రస్సు కొంటానని గడగడా చెప్పేస్తోంది కాజల్.
మేగజైన్లలో ఏదైనా కొత్త ప్రాంతానికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తే చాలు.. అక్కడ వాలిపోయేందుకు ప్లాన్స్ మొదలైపోతాయట. ఇప్పటికే ఫ్రాన్స్. ఇటలీ.. దుబాయ్.. జార్డన్.. ఫిలిప్పీన్స్.. నార్వే దేశాలకు బోలెడన్ని సార్లు వెళ్లొచ్చానని కూడా చందమామ అంటోంది. ఎప్పటికైనా సరే.. తన ప్రయాణాల అనుభవాలు అన్నిటినీ కలిపి పుస్తకం రాసేస్తా అంటోంది కాజల్ అగర్వాల్. మరి అందాల భామ అనుభవాలన్నీ తెలుసుకోవాలంటే ఆ 'చందమామ కథల' పుస్తకం రిలీజయ్యేవరకు ఆగాల్సిందే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/