Begin typing your search above and press return to search.

సేఫ్ కికి అంటున్న బెల్లంకొండ - కాజల్

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:21 AM GMT
సేఫ్ కికి అంటున్న బెల్లంకొండ - కాజల్
X

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు - మాస్ యాక్షను - పెద్ద స్టార్ హీరోయిన్లు - టెక్నిషియన్లు గుర్తొస్తున్నాయి.. దాన్ని మార్చాలి అనుకున్నాడో ఏమో గానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తో కికి ఛాలెంజ్ ని స్వీకరించాడు... కాకపోతే కొత్త యాంగిల్ కికి. పిచ్చి కికి చేస్తూ గాయాలపాలు కావొద్దని.. కికి చేసినా జాగ్రత్తగా చేయమని కికి సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు.

తన ట్విట్టర్ ద్వారా కికి ఛాలెంజ్ వీడియో పోస్ట్ చేస్తూ ఇలా ట్వీట్ పెట్టాడు "మేము కూడా ఇందులో అడుగుపెట్టాం. లేట్ అయినా ఫరవాలేదు కానీ సేఫ్ గా! మేము జాగ్రత్తగా చేసింది ఇది.. కికి వీ లవ్ యూ(కానీ రూల్స్ అంటే మాకింకా ప్రేమ). కాజల్ తో కలిసి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో పాల్గొంటూ ఇలా ట్రై చేయడం జరిగింది." వీడియో లో మొదట శ్రీనివాస్ - కాజల్ ఇద్దరూ వీల్ చైర్ లో కూర్చుని ఉంటే కాజల్ ఆ వీల్ చైర్ ను వేరేవాళ్ళు నెట్టుకుంటూ వస్తారు.. తర్వాత ఇద్దరూ లేచి కికి డూ యు లవ్ మీ అంటూ డ్యాన్స్ చేస్తారు. ఫైనల్ గా కాజల్ వీల్ చైర్లో కూర్చుంటుంది. శ్రీనివాస్ ఆ వీల్ చైర్ ను నెట్టుకుంటూ వెళ్తాడు.

కానీ ఆలా కూర్చునే ముందు. తమ మొహాలకైన గాయాలకున్న బ్యాండ్-ఎయిడ్ లను చూపిస్తూ కికి ని జాగ్రత్తగా చేయకపోతే ఇలా అవుతుందని, కాబట్టి ఇప్పుడు చేసినట్టు సేఫ్ గా చేయమని చెప్తారు. మొత్తానికి ఇద్దరూ కలిసి సూపర్ మెసేజ్ ఇచ్చారు. మీరెవరైనా సరే పిచ్చి కికిలు చేయకుండా బెల్లంకొండ బాబు - కాజలమ్మ చెప్పేది ఫాలో అవ్వండి. సేఫ్ గా ఉండండి!