Begin typing your search above and press return to search.

కాజల్ 71 లక్షల ముద్దుల లెక్క

By:  Tupaki Desk   |   18 April 2018 4:55 PM GMT
కాజల్ 71 లక్షల ముద్దుల లెక్క
X
ఓ అమ్మాయి అయినా హీరోయిన్ అయినా ఎన్ని ముద్దులు పెట్టగలరు.. ఓ పది.. పోనీ ఓ వంద.. ఇంకా కష్టపడితే ఓ వెయ్యి ముద్దులు పెట్టేయగలదు అనుకుందాం.. కానీ లక్షల కౌంట్ లో కిస్సులు అంటే.. అందులోనూ ఏకంగా 71 లక్షల ముద్దులు అంటే.. పెట్టడం సంగతేమో కానీ ఊహించడానికి కూడా భయపడాల్సిన విషయం.

కానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాత్రం ఏకంగా 71 లక్షల ముద్దులు అనేస్తోంది. ఒకే ఒక్క ముద్దు పెట్టి.. అది కూడా ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్లు సెల్ఫీకి ఓ పోజ్ ఇచ్చి.. ఇన్ని లక్షల ముద్దులు పెట్టేశాను అంటోంది. ముద్దు ముద్దుగా కాజల్ ఇచ్చిన ముద్దు.. భలే ముద్దుగా ఉంది కానీ.. ఇంతకీ ఈ ముద్దు ఎందుకు పెట్టిందో తెలుసా.. ఈ అమ్మడికి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయర్స్ సంఖ్య 7.1 మిలియన్లకు చేరుకుంది. అందుకే వారందరికీ థ్యాంక్స్ చెబుతూ ఇలా మిలియన్స్ కొద్దీ ముద్దుల సంఖ్య చెబుతోంది.

సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్. అత్యధిక ఫాలోయర్స్ ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీస్ లో కాజల్ పేరు టాప్ లిస్ట్ లో ఉంటుంది. దీనికి కారణం.. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె మరీ హైపర్ యాక్టివ్ గా ఉండడమే. ఈ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు అన్ని రకాల టెక్నిక్స్ పాటించేసే చందమామ.. తనకున్న ఈ ఫాలోయింగ్ ను కమర్షియల్ యాంగిల్ లో కూడా బాగానే వాడేసుకుంటూ ఉంటుంది.