Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బార్బీ డాల్ లా మురిపిస్తోందే
By: Tupaki Desk | 3 Jun 2019 8:25 AM GMTఎంతో మంది హీరోయిన్లు ఉన్నా వారిలో కాజల్ అగర్వాల్ రూటే సెపరేటు. అందుకే ఫిలిం ఇండస్ట్రీలో పదిహేనేళ్ళుగా కొనసాగగలుగుతోంది. దాదాపు అన్నీ భాషల సినిమాలను కవర్ చేసిన కాజల్ ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ కొత్త జెనరేషన్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ జెనరేషన్ హీరోయిన్లకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ అప్డేట్స్ తో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.
అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ తాజాగా కాజల్ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. అసలే ముంబై భామ కదా.. అందుకే ఈసారి ముంబైలోని పాపులర్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అయిన మెరైన్ డ్రైవ్ ను తన ఫోటో షూట్ కు లొకేషన్ గా ఎంచుకుంది. పింక్ కలర్ గౌన్.. వైట్ కలర్ షూ ధరించి.. జడవేసుకోకుండా వదిలేసిన హెయిర్.. సూటబుల్ మేకప్ తో అచ్చం బార్బీ డాల్ మాదిరిగా కనిపిస్తోంది. ముంబైలో ఎన్ని లొకేషన్స్ ఉన్నప్పటికీ మెరైన్ డ్రైవ్ అందమే వేరు. అందుకే ఆ లొకేషన్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.
"నాకు ఊహ తెలిసినప్పటి నుంచినేను చాలా సార్లు మెరైన్ డ్రైవ్ లో గడిపాను. సరిగ్గా ఇదే స్థలంలో కూర్చున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కూర్చొని ఎన్నో సార్లు నవ్వుతూ గడిపాను. 20- నిముషాల పవర్ వాక్స్.. మారథాన్ రన్నింగ్.. డ్రైవ్ ఎలా చేయాలో నేర్చుకోవడం.. ఋతుపవనాల సమయంలో చిరుజల్లుల్లో ఆమ్ రస్ (మామిడిపండు రసం) తాగడం.. అర్థరాత్రిపూట ఐస్ క్రీమ్స్ తినడం.. ఇవే కాదు.. మనసుకు గాయం తగిలినప్పుడు తనివితీరా ఏడవడం కూడా ఉన్నాయి. ఈ స్థలం ఇప్పటికీ ఎప్పటికీ నా మనసుకు దగ్గరైనది." అంటూ పెద్ద క్యాప్షన్ ఇచ్చింది.
రెగ్యులర్ పోస్ట్ ల కు భిన్నంగా ఈ పోస్ట్ కు డిఫరెంట్ కామెంట్స్ వచ్చాయి. ఒక నెటిజన్.. "ఎంత పెద్ద సెలబ్రిటీవి అయినా సాధారణమైన వ్యక్తిలాగా నీలోని భావాలు పంచుకున్నావు. లవ్డ్ ది పోస్ట్" అంటూ మెచ్చుకున్నాడు. మరొకరు "నా మనసును టచ్ చేశావు డియర్" అన్నారు. వీటితో పాటు "బార్బీ డాల్ లా ఉన్నావు".. "మెరైన్ డ్రైవ్ లో మెస్మరైజింగ్ బ్యూటీ" లాంటి కామెంట్లు కూడా పెట్టారు.