Begin typing your search above and press return to search.
ఆంటీ లుక్కులే ఫిక్స్ చేశారా?
By: Tupaki Desk | 19 July 2017 7:50 AM GMTఇప్పుడు సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వీలైనన్ని సినిమాలు త్వరత్వరగా చేసేయాలని చూస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 కూడా చేసినా.. ఆమెకు పెద్ద హీరోల నుండి పిలుపుమాత్రం రాలేదు. అందరూ కూడా కొత్త కొత్త హీరోయిన్లవైపే వెళుతున్నారు. అందుకే కాజల్ రానా.. కళ్యాణ్ రామ్ వంటి చిన్న హీరోలతో కూడా చేయడానికి రెడీ అయిపోతోంది. చేసేస్తోంది.
కాకపోతే ఎవ్వరూ కూడా కాజల్ ను ఒక చిన్నపిల్ల తరహాలో చూపించడానికి ఇష్టపడ్టలేదు. ఆల్రెడీ తేజ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి'లో ఆమె రానా కు భార్యగా నటిస్తోంది. అందుకే ఆ పాత్రలో హుందాతనం తీసుకురావడానికి ఆమెకు చీరలనే కాస్ట్యూమ్ గా డిసైడ్ చేశారు. చూస్తుంటే వయస్సు 30 దాటేసింది కాబట్టి కాజల్ ను మనోళ్ళు ఆంటీ తరహాలో ట్రీట్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తోందట ఆమె అభిమానులకు. ఇప్పుడిక కళ్యాణ్ రామ్ తీస్తున్న ఎమ్మెల్యే సినిమాలో కూడా కాజల్ చీరకట్టులోనే దర్శనమిస్తోంది. చూస్తోంది అక్కడ కూడా ఆంటీ తరహా రోల అనే సందేహం వస్తోంది. అయితే కాజల్ గ్లామరోత్సవానికి ఎప్పుడూ రెడీగా ఉండే హీరోయిన్. మరి ఆమె ఏజ్ కాస్త తగ్గించే ప్రయత్నం చేయండి గురూ.
ఇకపోతే ఆంటీ లుక్కులైనా... మోడ్రన్ గాళ్ లుక్కులోనైనా.. కాజల్ మాత్రం తన ఛమక్కులను బాగానే దట్టిస్తోంది. ఈ చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఆమెకు కెరియర్లో మరో అరడజను సినిమాలేమైనా వస్తాయేమో చూడాలి.