Begin typing your search above and press return to search.

మీక్కావాల్సిన మెనూ ఇక్క‌డుంది.. వ‌డ్డించుకోండి!!

By:  Tupaki Desk   |   4 Feb 2020 6:13 AM GMT
మీక్కావాల్సిన మెనూ ఇక్క‌డుంది.. వ‌డ్డించుకోండి!!
X
సోష‌ల్ మీడియా యుగంలో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డాలంటే చాలా హార్డ్ వ‌ర్క్ తో కూడుకున్న వ్య‌వ‌హార‌మే. డిజిట‌ల్ స్పీడ్ కి ప‌ట్నం ప‌ల్లె అన్న తేడా లేకుండా ప్ర‌పంచం కుగ్రామంగా మారిపోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రికి ఉచిత ప్ర‌చారం సులువు అయిపోయింది. ఆ క్ర‌మంలోనే సెల‌బ్రిటీల‌కు ధీటుగా సామాన్య ప‌డ‌తులు సైతం త‌మ‌ను తాము ప్ర‌మోట్ చేసుకుంటూ రంగుల క‌ల‌లు కంటున్నారు.

ఈ వెల్లువ‌లో సినిమా స్టార్ ఎవ‌రో.. ప‌క్కింటి సుబ్బ‌ల‌క్ష్మి ఎవ‌రో క‌నిపెట్ట‌డం కూడా క‌ష్టంగానే మారింది. అందుకే ఈ ట్రెండ్ ఇలా ఉంటే లాభం లేద‌ని భావించిందో ఏమో.. ఇటీవ‌లి కాలంలో డీసెంట్ గాళ్.. అందాల చంద‌మామ సైతం సోష‌ల్ మీడియా ప్ర‌భావానికి లోనైంది. అక్క‌డ రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. సాటి నాయిక‌ల‌కు ఒక ర‌కంగా కాజ‌ల్ చుక్క‌లు చూపించే ప‌నిలో ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే లేటెస్టుగా రెడ్ హాట్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది.

చూడ‌టానికి ఆ డ్రెస్ ఎంత ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తోందో అంత‌కుమించి చంద‌మామ అందాలు అంతే కొంటెగా క‌వ్విస్తున్నాయి. మీక్కావాల్సిన మెనూ ఇక్క‌డుంది.. వ‌డ్డించుకోండి!! అన్న‌ట్టుగా ఉందీ ఫోజు. అస‌లే ఈవెనింగ్ స్నాక్స్ కోసం వెళ్లిన‌ట్టుంది.. ఆ ఓపెన్ టాప్ టేబుల్ పై మెనూ వైపే చూస్తూ త‌న‌కు ఏమీ తెలియ‌నట్టే నంగ‌నాచిలా ఇచ్చింది ఆ ఫోజు. రెడ్ హాట్ డిజైన‌ర్ డ్రెస్ లో కాజ‌ల్ అందాలు ప‌దింత‌లు అయ్యాయి. దానికి తోడు ఆ గాంధీగారి క‌ళ్ల‌ద్దాలు అమ్మ‌డి అమాయ‌క‌త్వాన్ని అందులో ఉన్న ఆహ్లాదాన్ని ప‌దింత‌లు చేయ‌డంతో కుర్ర‌కారు క‌ళ్లు తిప్పుకోవ‌డానికి చాలానే క‌ష్ట‌ ప‌డుతున్నారు మ‌రి.

కెరీర్ ప‌రంగా చూస్తే కాజ‌ల్ రెండు మూడు చిత్రాల‌తో బిజీగా ఉంది. మంచు విష్ణుతో క‌లిసి ఓ బ‌హుభాషా చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ప్యారిస్ ప్యారిస్ రిలీజ్ కావాల్సి ఉంది. ముంబై సాగా అనే హిందీ చిత్రంలోనూ న‌టిస్తోంది. అలాగే 2020- 21 మోస్ట్ అవైటెడ్ మూవీ భార‌తీయుడు 2 లోనూ ప్ర‌ధాన నాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ శంక‌ర్ కి కావాల్సిన‌న్ని కాల్షీట్లు ఇచ్చేశాక‌.. ఇక వేరొక‌రికి ఇచ్చేంత స్కోప్ ఉండ‌దు కాబ‌ట్టి కాజ‌ల్ నుంచి మ‌రో కొత్త సినిమాని ఇప్ప‌ట్లో ఆశించ‌డం క‌ష్ట‌మేనేమో!!