Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్..కరోనా వేళ సమోసాలు తయారీ

By:  Tupaki Desk   |   11 April 2020 8:10 AM GMT
స్టార్ హీరోయిన్..కరోనా వేళ సమోసాలు తయారీ
X
ఒకటి కాదు.. రెండు ఏకంగా 21 రోజులు లాక్ డౌన్. దేశంలో ఎవరూ ఇంటి నుంచి కాలు అడుగు బయటపెట్టడానికి వీల్లేదు. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు - కుటుంబంతో గడిపేస్తున్నారు. ఈ ఖాళీ టైంలో సినిమాలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూ తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగితేలుతున్నారు.

అయితే తాజాగా స్టార్ హీరోయిన్ సమోసాలు చేస్తోంది. కాజల్ లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైంది. తనకు ఎంతో ఇష్టమైన సమోసాలను స్వయంగా వంటింట్లో చేస్తోంది. ఈ మేరకు ఆమే చేస్తున్న ఫొటోలు - వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఖాళీ టైంలో తనకు ఇష్టమైన సమాసాలు చేస్తున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ పోస్టు చేసింది.

ప్రస్తుతం కాజల్ బడా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. కమల్ హాసన్-శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 మూవీతోపాటు తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న ‘ఆచార్య’ మూవీలోనూ చేస్తోంది. లాక్ డౌన్ తో షూటింగ్స్ బంద్ కావడంతో ఇలా ఇంట్లో తనకిష్టమైన పంజాబీ సమోసాలు చేస్తూ సేదతీరుతోంది.