Begin typing your search above and press return to search.
డ్రగ్స్ డెస్టినీ: కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్
By: Tupaki Desk | 24 July 2017 11:50 AM GMTటాలీవుడ్‌ను కుదిపేస్తున్నడ్రగ్స్ విచారణ వ్యవహారంలో మరో సంచలనం చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ ఉదంతంలో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న రోనీని పోలీసులు అరెస్ట్ చేయటం ఇప్పుడు మరో కొత్త మలుపుగా చెప్పాలి.
ఇప్పటికే డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖుల్ని రోజుకు ఒకరు చొప్పున గంటల తరబడి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో వెలుగు చూస్తున్న సమాచారంతోనే తాజా అరెస్ట్ చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోనీని అతని నివాసం దగ్గర ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. కొన్ని సంవత్సరాలుగా కాజల్ అగర్వాల్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న రోనీ.. గతంలో ప్రముఖ హీరోయిన్లు రాశీఖన్నా.. లావణ్య త్రిపాఠిలకు కూడా మేనేజర్లుగా పని చేయటం గమనార్హం. తాజా అరెస్ట్ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ సందర్భంగా మీడియాలో రోనీకి సంబంధించిన ఫోటో ఒకటి హడావుడి చేస్తోంది. కాజల్ అగర్వాల్ కు సన్నిహితంగా ఉన్న ఫోటో పలు ఛానళ్లు ప్రసారం చేశాయి. డ్రగ్స్ కేసు విచారణలో తాజా అరెస్ట్ ఒక అనూహ్య పరిణామంగా చెబుతున్నారు. ఇంతవరకూ సినీ పరిశ్రమకు సంబంధించిన వారిని విచారించటమే కానీ అరెస్ట్ చేయని నేపథ్యంలో.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.