Begin typing your search above and press return to search.

అసలు.. కాజల్‌ ను అడిగితే ఒట్టు

By:  Tupaki Desk   |   21 Jun 2016 4:20 AM GMT
అసలు.. కాజల్‌ ను అడిగితే ఒట్టు
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి ఈ ఏడాది సమ్మర్ ఏ మాత్రం అచ్చిరాలేదు. వరుసగా మూడు నెలల్లో మూడు దెబ్బలు తినేసింది. ఏప్రిల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. మే నెలలో సూపర్ స్టార్ మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం.. ఇక జూన్ నెలలో బాలీవుడ్ మూవీ దో లఫ్జోం కీ కహానీ.. అన్నీ సూపర్ ఫ్లాప్ లు అయిపోయాయి. కాజల్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.

ఈ దెబ్బకి చందమామ చిన్న రోల్స్ కి దిగిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. తేజ సినిమాలో ఓ పాత్రకి యాక్సెప్ట్ చేయడం.. కృష్ణవంశీ మూవీలో సైడ్ కేరక్టర్ చేస్తాననడంతో ఈ టాక్ బయల్దేరింది. ఇది కాక.. రామ్ చరణ్ తో ధృవలో ఐటెం సాంగ్ కు కూడా ఒప్పుకుందనే వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. తేజ-కృష్ణవంశీలు.. ఈ భామ కెరీర్ ని పైకి తెచ్చిన డైరెక్టర్స్. అందుకే వాళ్ల ఆఫర్స్ ని యాక్సెప్ట్ చేసి ఉండచ్చని అనుకున్నా.. చెర్రీతో ఐటెం సాంగ్ విషయంలో క్లారిటీ రాలేదు.

అదే సంగతి కాజల్ అగర్వాల్ ని అడిగితే ఏంమంటోందో తెలుసా.. 'అసలు చేస్తానో లేదో తర్వాత చెబ్తాను.. ముందసలు నాకు అలాంటి ఆఫర్ రావాలి కదా? వచ్చినపుడు చేస్తానో లేదో క్లారిటీ ఇస్తాను. ముందే ఎందుకు చెప్పడం?' అంటూ ఓ పజిల్ విసిరింది. అంటే.. ఐటెం సాంగ్ కోసం ఈ భామను సురేందర్ రెడ్డి అప్రోచ్ అయ్యాడన్న మాట నిజం కాదన్న మాట. అయినా కాజల్ వెర్షన్ కూడా రైటే కదా.. అసలు అడగందే.. విషయం తేల్చమంటే తను మాత్రం ఏం చెబుతుంది పాపం?