Begin typing your search above and press return to search.

కాజలూ.. చంపేశావ్ పో!

By:  Tupaki Desk   |   7 Nov 2015 9:30 AM GMT
కాజలూ.. చంపేశావ్ పో!
X
ఎంతైనా కాజల్ కాజలేనెహే.. చంద్రబింబం లాంటి మోము చూడు.. కలువల్లాంటి కళ్లు చూడు.. నీలాల ఆ కురులు చూడు.. గులాబీల్ని గుర్తుకు తెచ్చే ఆ పెదవులు చూడు.. చురుకైన ఆ ముక్కు చూడు.. మొత్తంగా రాజకుమారిని తలపించే ఆ రాజసం చూడు.. ఒంటి మీద నగలు అలంకరించుకుంటే ఆ నగలకే అందం వచ్చింది చూడు. ముగ్ధమనోహరమైన ఈ అందం సినిమాల్లోకి వచ్చి అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. కానీ నిన్నో మొన్నో అరంగేట్రం చేసినట్లు ఆ నవనవలాడే అందం చూడు.

అందుకే మరి.. చందమామ అనే పేరు కాజల్ ను ఉద్దేశించి పెట్టింది కాకపోయినా.. ఆమెను ‘చందమామ’ అనే పిలుచుకుంటున్నారు అభిమానులు. పదేళ్ల పాటు ఓ హీరోయిన్ కెరీర్ కొనసాగించడమే గొప్పనుకుంటే.. ఆ పదేళ్ల తర్వాత కూడా డిమాండింగ్ పొజిషన్ లో ఉండటం కాజల్ కే చెల్లింది. సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహ్మోత్సవం లాంటి క్రేజీ సినిమాలు చేస్తున్న చందమామ.. రీసెంట్ గా తీసిన ఓ ఫొటో షూట్లో ఇలా కళ్లు చెదిరే రీతిలో దర్శనమిచ్చింది.