Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పూల్ సైడ్ పుత్రోత్సాహం

By:  Tupaki Desk   |   3 Jun 2019 5:10 AM GMT
ఫోటో స్టోరి: పూల్ సైడ్ పుత్రోత్సాహం
X
అందాల చంద‌మామ కాజ‌ల్ - నిషా అగ‌ర్వాల్ సిస్ట‌ర్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నిషా తెలుగులో `ఏమైంది ఈవేళ‌`, `సోలో` లాంటి హిట్ సినిమాల్లో న‌టించింది. అయితే అటుపై స‌రైన స‌క్సెస్ లేక కెరియ‌ర్ కి కామా పెట్టి.. బిజినెస్ మేన్ క‌ర‌ణ్ ని పెళ్లాడేసిన సంగ‌తి తెలిసిందే. నిషా- క‌రణ్ జంట‌కు పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. ప్ర‌స్తుతం ఈ బుజ్జిగాడు వేగంగా ఎదిగేస్తున్నాడు. చెల్లెలు నిషాకి కొడుకు పుట్టిన‌ప్ప‌టి నుంచి పెద్ద‌మ్మ అయిన‌ కాజ‌ల్ ని ఎవ‌రూ ఆప‌లేక‌పోతున్నారు. పుత్రోత్సాహాన్ని నిషా కంటే ఎక్కువ‌గా ఆస్వాధిస్తున్న‌ది కాజల్ నే అంటూ సెటైర్లు ప‌డుతున్నాయి. మాస్టార్‌ నిషాన్ ని ఎత్తుకుని కాజ‌ల్ ప‌లుమార్లు ఫోటోల‌కు ఫోజులిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఫోటోలు వెబ్ లో జోరుగా వైర‌ల్ అయ్యాయి.

తాజాగా సిస్ట‌ర్ నిషా.. ఆమె సుపుత్రునితో క‌లిసి కాజ‌ల్ ఇలా పూల్ సైడ్ ద‌ర్శ‌న‌మిచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో మాస్ట‌ర్ నిషాన్ తో క‌లిసి ఇలా జాలీగా టైమ్ స్పెండ్ చేస్తోంది కాజ‌ల్. సిస్ట‌ర్ సెల‌బ్రేష‌న్ చూశాక అయినా కాజ‌ల్ మూడ్ మారుతుందా.. పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుందా? అంటూ అభిమానుల్లో కొత్త సందేహం మొద‌లైంది. మ‌రి ఈ ప్ర‌శ్న‌కు చంద‌మామ నుంచే స‌మాధానం రావాల్సి ఉంది.

అన్న‌ట్టు కాజ‌ల్ న‌టించిన `ప్యారిస్ ప్యారిస్` రిలీజ్ కి రెడీగా ఉంది. కానీ ఎందుకు రిలీజ్ కావ‌డం లేదో తెలీదు. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ - శంక‌ర్ కాంబినేష‌న్ ప్రాజెక్ట్ `భార‌తీయుడు 2` మూడు బ్రేకులు ఆరు ఇబ్బందులు అన్న‌ట్టే సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో భారీ సినిమాకి సంబంధించిన కొత్త వివ‌రం ప్ర‌క‌టిస్తాన‌ని కాజ‌ల్ ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. అలాగే అందం ఫిజిక‌ల్ అప్పియ‌రెన్స్ కు సంబంధించిన‌ది కాదు! మంచి మ‌న‌సుకు సంబంధించిన‌ది!! అని చెబుతూ ఓ లేటేస్ట్ ఫోటోషూట్ తో కాజ‌ల్ స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.