Begin typing your search above and press return to search.

ప్రేమ లేఖలు బాగా చదువుతా

By:  Tupaki Desk   |   31 Jan 2018 11:30 PM GMT
ప్రేమ లేఖలు బాగా చదువుతా
X
అమ్మాయి అందానికి అసలైన అవార్డ్ ప్రేమ లేఖ అని కొంత మంది కవులు ఆ మధ్యలో బాగానే చెప్పారు. అందమైన అమ్మాయి ప్రతి కదలికలో కవ్వించే అందం కావ్యాలుగా ఓ పేపర్ లో కొత్త రూపం పొందుతుందంటే మగువ ఎంతో మాయ చేస్తే గాని రాదు. ప్రేమ లేఖలు ఈ రోజుల్లో మెస్సేజ్ రూపంలోకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ వేరియేషన్ ఎలా మారినా భావంలో మాత్రం ఎక్కడా తేడా రాదు.

ఇక అసలు విషయానికి వస్తే అక్షరం తెలియని వాడికి కూడా రొమాన్స్ పాఠాలు నేర్పించే కాజల్ కి కూడా ప్రపోజల్స్ చాలా వచ్చాయట. హీరోయిన్ అవ్వకముందు ప్రేమ లేఖలు ఏ రేంజ్ లో అందేవో ఇప్పుడు కూడా అందుతున్నాయట. కానీ ఇప్పుడు సంఖ్య చాలా ఎక్కువయిందని కాజల్ చెబుతోంది. ఈ సౌంత్ చందమామ తనకు వచ్చిన ప్రతి లెటర్ ని చదువుతుందట. కాలిగా ఉంటే అదే పని అని చెబుతోంది.

ఎందుకంటే ఆ లెటర్స్ లో చాలా ప్రేమ ఉంటుందని కాజల్ వివరిస్తోంది. కానీ కొన్ని లెటర్స్ ని చుస్తే మాత్రం చాలా భయంగా ఉంటుందని చెబుతోంది. ఎందుకంటే కొన్ని లెటర్స్ రక్తంతో రాసి ఉంటాయట. అది చూసినపుడు భయంతో పాటు బాధగా ఉంటుందని. వాటిని నేను ఒప్పుకోను. నేనే కాదు ఎవరు సపోర్ట్ చేయరని కూడా కాజల్ అంటోంది. ప్రస్తుతం కాజల్ తెలుగు అండ్ తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.