Begin typing your search above and press return to search.

కాజల్ కంటికి అతను ఆనలేదా??

By:  Tupaki Desk   |   31 Oct 2017 4:39 AM GMT
కాజల్ కంటికి అతను ఆనలేదా??
X
శతమానం భవతి - మహానుభావుడు సినిమాల వరస హిట్లతో జోష్ మీదున్నాడు యంగ్ హీరో శర్వానంద్. స్టార్ హీరోల సినిమాలు థియేటర్ లో ఉన్నా కూడా ధైర్యం చేసి మూవీని రిలీజ్ చేయడమే కాకుండా మంచి కలెక్షన్లు సైతం కొల్లగొడుతున్నాడు. మీడియం రేంజి హీరోలో టాప్ లీగ్ లో ఉన్న శర్వానంద్ తన తర్వాత సినిమా సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేయబోతున్నాడు.

ఈ సినిమాకు శర్వానంద్ కు హీరోయిన్ దొరకడం లేదనేది లేటెస్ట్ న్యూస్. ఈ మూవీలో శర్వానంద్ ది డబుల్ రోల్. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా.. ఇంకోటి మధ్యవయస్కుడి పాత్ర. ఇందులో మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కు హీరోయిన్ ను అన్వేషిస్తున్నారు. ఈ పాత్రకు టాలీవుడ్ చందమామ కాజల్ ను తీసుకోవాలని భావించి ఆమెను సంప్రదిస్తే సింపుల్ గా నో చెప్పేసిందట. భారీ మొత్తం రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఆ రోల్ చేయడానికి ఇష్టపడలేదుట. దీంతో ఈ అవకాశం మిల్కీ బ్యూటీ తమన్నాను వరించింది. ఇంకా దీనిపై తమన్నా నుంచి ఇంకా నిర్ణయం రాలేదు. ఈ మూవీలో ఇంకో హీరోయిన్ ను కూడా తీసుకోవాల్సి ఉంది. ఈ పాత్రకు ఎవరిని తీసుకోవాలనే దానిపైనా ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీకి రాలేదు.

ఇంతకీ అసలు కాజల్ కంటికి శర్వా ఎందుకు ఆనలేదు? కాజల్ అగర్వాల్ జోరు ఈ మధ్య తగ్గినప్పటికీ మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో తిరిగి పాపులారిటీ పెంచుకుంది. వీలైనంత వరకు గ్లామర్ పాత్రలతో ఓకే చెబుతూ వరుసగా ఈ ఏడాది నాలుగు హిట్లు కొట్టింది. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటుతున్న తరుణంలో ఒక్కసారి ఈ ఇమేజ్ పోతే మళ్లీ రావడం కష్టం. అందుకే కాజల్ ఇలాంటి యంగ్ అండ్ తక్కువ స్టార్డమ్ హీరోతో చేస్తే తన రేంజ్ తగ్గుతుందని భావించి ఈ ఆఫర్ వద్దనుకుందనేది ఆమె సన్నిహితుల మాట.