Begin typing your search above and press return to search.

1.75 కోట్లు ఇస్తే ఏ హీరో అయితేనేం?

By:  Tupaki Desk   |   6 Oct 2018 11:08 AM GMT
1.75 కోట్లు ఇస్తే ఏ హీరో అయితేనేం?
X
‘చందమామ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో చరగని ముద్ర వేసిన ముద్దుగుమ్మ కాజల్‌ ఆ తర్వాత ‘మగధీర’ చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌ గానే కొనసాగుతూ వస్తోంది. సహజంగా హీరోయిన్స్‌ సీనియర్స్‌ అవుతుంటే అవకాశాలు తగ్గుతాయి. అలాగే పారితోషికం కూడా తగ్గుతూ వస్తుంది. కాని కాజల్‌ విషయంలో మాత్రం రివర్స్‌ లో జరుగుతుంది. ఈ సమయంలో కాజల్‌ కోట్లలో పారితోషికం తీసుకుంటూ అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

ప్రస్తుతం ఈమె బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రంలో నటించేందుకు కాజల్‌ ఏకంగా 1.75 కోట్ల రూపాయల పారితోషికంను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మామూలుగా అయితే చిన్న హీరోలతో స్టార్‌ హీరోయిన్స్‌ నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని భారీ పారితోషికం ఆఫర్‌ చేసిన కారణంగా కాజల్‌ ఈ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది.

కాజల్‌ ప్రస్తుతం బెల్లంకొండ, తేజ మూవీతో పాటు తమిళంలో ‘క్వీన్‌’ రీమేక్‌లో కూడా నటిస్తోంది. ఆ చిత్రానికి కూడా కాజల్‌ భారీగానే దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి కాజల్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా పూజా హెగ్డే - కియారా అద్వానీల స్థాయిలో పారితోషికంను దక్కించుకుంటూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.