Begin typing your search above and press return to search.

చిరుతో సినిమా.. విమర్శలపై స్పందించింది

By:  Tupaki Desk   |   7 Nov 2016 9:30 AM GMT
చిరుతో సినిమా.. విమర్శలపై స్పందించింది
X
ఒకప్పుడైతే తండ్రితో నటించిన హీరోయిన్‌ తో కొడుకు చేయకూడదని.. అబ్బాయితో చేసిన కథానాయికతో బాబాయి నటించకూడదని అనధికార షరతులు పెట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే అక్కడ ఏడెనిమిది మంది హీరోలున్నారు. వరసలు చూసుకుని ఒకరితో పని చేసిన కథానాయికతో ఇంకొకరు చేయకూడదు అనుకుంటే చాలా కష్టం.

అందుకే శ్రుతి హాసన్.. కాజల్.. తమన్నా లాంటి హీరోయిన్లతో పవన్ కళ్యాణే కాక.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ కూడా పని చేశారు. ఐతే వీళ్లంతా ఓకే కానీ చిరు సీన్లోకి వచ్చేసరికే కొంచెం ఇబ్బంది ఎదురైంది. రామ్ చరణ్ సరసన నటించిన కాజల్ అగర్వాల్‌ తో ‘ఖైదీ నెంబర్ 150’లో చిరు రొమాన్స్ చేస్తాడన్న వార్త బయటికి రాగానే జనాలకు అదోలా అనిపించింది. దీనిపై కొందరు విమర్శలు గుప్పించారు. ఐతే చిరు అండ్ కో అలాంటిదేమీ పట్టించుకోకుండా ప్రొఫెషనల్ గా ముందుకెళ్లిపోయింది. దీనిపై చిరంజీవి కానీ.. మిగతా యూనిట్ సభ్యులు కానీ.. స్పందించింది లేదు.

ఐతే కాజల్ తాజాగా ఈ విషయమై రెస్పాండైంది. ‘‘చిరంజీవి గారితో ‘ఖైదీ నంబర్‌ 150’ ఒప్పుకుంది మొదలు ‘ముందు కొడుకుతో నటించారు... ఇప్పుడు తండ్రితో నటిస్తున్నారే’ అని అడుగుతున్నారు. ఐతే ఇలాంటి వాటికి నేనిచ్చే సమాధానం ఒకటే. నేను నటిని. నాకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా చేయడం నా పని. కథ, నా పాత్ర... వీటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. నేను ఎవరితో నటిస్తున్నాను అనే విషయం కాకుండా నా పాత్ర ఏంటి అనే దాని పైనే దృష్టిపెడతాను . అందుకే తండ్రీకొడుకులతో నటించినా తేడా ఏం కనిపించలేదు. చిరంజీవి లాంటి లెజెండ్‌ తో పని చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే’’ అని సెలవిచ్చింది కాజల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/