Begin typing your search above and press return to search.

ఆ మాటలను పట్టించుకోను -కాజల్

By:  Tupaki Desk   |   15 July 2017 9:47 AM GMT
ఆ మాటలను పట్టించుకోను -కాజల్
X
క్రియేటివ్ ఇండస్ట్రిలో మరీ ముఖ్యంగా సినిమా రంగంలో చెడు వార్తలు తొందరగా ప్రచారం జరుగుతాయి. కొన్ని వార్తలకు ఆధారం ఉండదు.. కొన్నిటికి అంతం ఉండదు. ఇప్పుడు మన సౌత్ సినిమాలో ఒక టాప్ హీరోయిన్ తన పై అనవసర పుకారులు రావడంతో కాస్త హర్టయ్యింది. ఆమె ఎవరో కాదండోయ్.. మన కాజల్ అగర్వాలే. పదండి ఏమంటుందో చూద్దాం.

ఆ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్ కెరియర్ కొంచం కుంటిపడింది కానీ.. ఇప్పుడు సూపర్ స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయ్యింది. కాజల్ పై ఇప్పుడు చాలా విమర్శలు పుకారులు వినిపిస్తున్నాయి. ఆమె అందానికి మెరుగులు దిద్దుకుందిని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అనే వార్తలు.. అలాగే ఒక తెలుగు హీరోతో డేటింగ్ చేస్తుంది అనే రూమర్లు వచ్చాయి. దానికి కాజల్ అగర్వాల్ వివరణ చాలా సూటిగా ఇచ్చింది. “నేను ఏంటో నాకు తెలుసు నా పైనా నటన పై నాకు నమ్మకం ఉంది. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నాపై ఇలా లేనిపోనీ పుకారులను పుట్టిస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నేను వాటికి భయపడును సరికదా వాళ్ళందరికీ తొందరలో నా వర్కుతో జవాబు చెబుతాను'' అని గట్టిగానే చెప్పింది.

ఈమె ఇలాంటి పుకారులు రావడానికి ప్రధాన కారణం ఏంటి అని ఆలోచిస్తే ఈమె ఒక ఇంటర్వ్యూ లో “నేను ప్రేమ వివాహమే చేసుకుంటాను అని నేను చేసుకునే వాడు సినిమావాడా లేక బయటవాడా అనేది చెప్పలేను'' అని చెప్పింది. అంతటితో ఆగక నా ప్రియుడు కచ్చితంగా ఆరు అడుగులు ఉంది తీరాలి అని ఒక షరతు పెట్టుకుంది. ఆ డైలాగ్స్ ను బట్టి చూస్తే రాసే రూమర్లలో నిజం ఉందనే ఎవరైనా అనుకుంటారు. ఆ ముక్కు మ్యాటర్ అంటారా.. మరి ఫోటోల్లో తేడా ఏంటో కాజల్ కే తెలియాలి.