Begin typing your search above and press return to search.

కాజల్‌.. ఏపీ పారిశ్రామిక వేత్త.. ?

By:  Tupaki Desk   |   27 Jun 2015 1:30 PM GMT
కాజల్‌.. ఏపీ పారిశ్రామిక వేత్త.. ?
X
చందమామ కాజల్‌ తెలుగువాళ్లని కాదని తమిళ్‌, హిందీ పరిశ్రమల వైపు వెళ్లిపోయింది. ఈ విషయంలో అభిమానులంతా గుర్రుమీద ఉన్నారు. అయినా తెలుగు పరిశ్రమని ఎప్పటికీ దూరం చేసుకోలేను అని సన్నాయి నొక్కులు నొక్కుతోంది కాజల్‌. ఇప్పటికిప్పుడు కోలీవుడ్‌లో మారి, పాయుంపులి, మర్మ మణిధాన్‌ ఇన్ని సినిమాల్లో నటిస్తోంది.

ఇటీవలే ఓ బాలీవుడ్‌ చిత్రానికి సంతకం చేసింది. ఇవన్నీ పూర్తి చేసి తెలుగులో నటించాలంటే మరో రెండేళ్లయినా పడుతుంది. ఇదంతా సరే ఇలా ప్రాజెక్టులతో బిజీ అయిపోతే పెళ్లి చేసుకునేదెప్పుడు? ఇప్పటికే ఏపీకి చెందిన ఓ పారిశ్రామిక వేత్తతో ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.. అని ఓ ప్రశ్న వేస్తే.. దానికి వంకరగా సమాధానం చెప్పింది. అవునా..! నాక్యూడా ఇది న్యూసే. ఓ లవర్‌ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా అని అంది. ఆ వెంటనే అయినా నాకు రొమాన్స్‌ చేసేంత టైమే లేదు.. అంటూ కట్‌ చేసే ప్రయత్నం చేసింది.

అయినా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆస్కారమే లేదు. ఒకవేళ నేను రిలేషన్‌షిప్‌లో ఉంటే అది ఈ ప్రపంచానికి నేనే రివీల్‌ చేస్తానని చెప్పింది. అయినా కాజల్‌పై జరుగుతున్నది కేవలం ఒట్టి ప్రచారమేనా? అసలింతకీ ఆ ఆంధ్రా పారిశ్రామిక వేత్త ఎవరు? అదంతా కేవలం ట్రాష్‌ ఏనా?