Begin typing your search above and press return to search.
అరుదైన కాంబినేషన్ గోపీచంద్-కాజల్
By: Tupaki Desk | 27 July 2018 11:28 AM GMTదాదాపు స్టార్ హీరోయిన్లందరితో చేసిన గోపీచంద్.. ఇంతవరకూ కాజల్ తో జోడీ కట్టలేదు. అప్పట్లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మొగుడు’ సినిమాకు ముందుగా కాజల్ ని తీసుకోవాలని కృష్ణవంశీ భావించాడట.. కానీ డేట్స్ ప్లాబ్లమా.. మరేదో కానీ.. కాజల్ చేయలేకపోయింది. కాజల్ ప్లేసులో ఢిల్లీ భామ తాప్సీ ఆ పాత్రను పోషించింది. ఇక ఆ తర్వాత గోపీచంద్ తో కాజల్ చేసింది లేదు.. కానీ ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కాజల్-గోపీచంద్ కాంబినేషన్ సెట్ అయ్యింది.
ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. కుమార్ సాయి అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కథనాయికగా కాజల్ ను తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నాడు.
గోపీచంద్ - కాజల్ ఇద్దరూ తమ సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి పదేళ్లు దాటింది. ఇప్పటికీ గానీ వీళ్ల కాంబినేషన్ కుదరలేదు. రకుల్ ప్రీత్ - అనుష్క - ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్లతో చేసిన గోపీచంద్ కు ఇప్పటివరకూ కాజల్ తో నటించకపోవడం నిజంగా విడ్డూరమే..