Begin typing your search above and press return to search.
ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ కాజల్ తో..
By: Tupaki Desk | 20 March 2018 2:59 PM GMTచిరంజీవి దగ్గరనుండి నాగ చైతన్య వరకు దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన నటించేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ చేసిన హీరోలతోనే మళ్ళీ సినిమాలు చేస్తోంది. లక్ష్మీ కల్యాణం సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన నటించిన మన టాలీవుడ్ చందమామ మళ్ళీ ఎం.ఎల్.ఏ సినిమాతో అదే నందమూరి హీరోతో జాతకట్టింది. ఇప్పుడు మళ్లీ అంతకుముందు కలిసి నటించిన హీరోతో మరో సినిమా ఒప్పుకుంది.
గరుడవేగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు తన స్క్రిప్టును హీరో రామ్ కు వినిపించాడు. కథ బావుండడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు మన 'నేను శైలజ' హీరో. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయినుగా కాజల్ నే తీసుకున్నారట. గతంలో రామ్ తో కలసి కాజల్ జస్ట్ గణేష్ అనే సినిమాలో నటించింది. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.
దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే తెరపైన కనిపించనున్నారు ఈ జంట. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో - త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా పూర్తవగానే కాజల్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతాడు. హైపర్ - ఉన్నది ఒకటే జిందగి ఫ్లాప్స్ తర్వాత ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. చూద్దాం ఏం అవుతుందో..