Begin typing your search above and press return to search.
నేను స్పెషల్ అంటున్న కాజల్
By: Tupaki Desk | 4 July 2015 4:47 AM GMTఅంటే గింటే అనుష్క అనాలి నేను స్పెషల్ అని! ఆమె హీరో లెవెల్లో కత్తులు తిప్పుతుంది. హీరోల లెవెల్లో భారీ బడ్జెట్లతో కూడిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. చేయడమే కాదు.. వాటితో సక్సెస్‌లు కూడా కొడుతోంది. మరి ఆమెని స్పెషల్ అనకుండా ఎలా ఉండగలం. కానీ కాజల్ మాత్రం మీరెన్నైనా చెప్పండి, నా రూట్లో నేనే స్పెషల్ అంటోంది. ఇంతకీ కాజల్‌లో స్పెషాలిటీ ఏంటబ్బా అని ఆరా తీస్తే... ఆమె అడుగు పెట్టిన ప్రతీ భాషలోనూ విజయాలు అందుకొందట. అదే తన స్పెషాలిటీ అంటోంది. ఆమె అంతరంగాన్ని తెలుసుకొన్నాక అర్థమైందేంటంటే... త్రిష, తమన్నా, తాప్సిలాంటి వాళ్లతో పోల్చి చూసుకొని ఆమె ఈమాట చెబుతోందని!
త్రిష బాలీవుడ్ కలలు కంటూ ముంబై వెళ్లిపోయింది. తొలి సినిమా 'కట్టా మీటా'తోనే వెనక్కి తిరిగొచ్చింది. తమన్నాకి కూడా అక్కడ అస్సలు కలిసిరాలేదు. తాప్సి కెరీర్ కూడా ఒడిదుడుకుల్లోనే సాగుతోంది. వాళ్లతో పోల్చి చూసుకొంటే నాకు హిందీతోపాటు, తెలుగు, తమిళం.. ఇలా అన్ని భాషల్లోనూ సక్సెస్‌లే కదా అన్నట్టు మాట్లాడుతోంది కాజల్. మరి అసిన్, ఇలియానాలాంటి వాళ్లు కూడా అక్కడ హిట్లు కొట్టారు కదమ్మా అని గుర్తు చేస్తే... వాళ్లు బాలీవుడ్లోనే కెరీర్‌ని వెదుక్కొంటున్నారు, వాళ్లతో నాకు పోలిక పెట్టొద్దన్నట్టు మాట్లాడుతోంది. అన్నట్టు కాజల్ ఇప్పుడు ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ... ఇలా మూడు భాషల్లోనూ నటిస్తూ నిజంగానే స్పెషల్ అన్నట్టు కనిపిస్తోంది.