Begin typing your search above and press return to search.

ఇలా అయిపోయావేంటి కాజల్?

By:  Tupaki Desk   |   4 July 2016 11:09 AM GMT
ఇలా అయిపోయావేంటి కాజల్?
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చాలా విషయాల్లో పర్ఫెక్ట్. పారితోషికం నుంచి ఫిజిక్ వరకు.. డేట్స్ నుంచి టైమింగ్ వరకూ.. ఇటు కమర్షియల్ యాంగిల్ నీ అటు ప్రొఫెషనల్ యాంగిల్ ని సూపర్బ్ గా మెయింటెయిన్ చేస్తుంది. అయితే.. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్లు గడిచినా.. ఇంకా లీడ్ హీరోయిన్ గా కొనసాగడంలో అమ్మడి ట్యాలెంట్ తో పాటు అందాన్ని మెయింటెయిన్ చేసే స్టామినా కూడా ముఖ్యం.

ఇప్పుడు కొత్తదనం చూపించాలని అనుకుందో.. థర్టీ ప్లస్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుందో కానీ.. ఇప్పుడు కాజల్ జీరో సైజ్ హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్ గా విడుదలైన మూడు సినిమాల్లోనూ నిండుగా కనిపించిన చందమామ.. ఇప్పుడు వెలవెల బోయింది. ఆటా వేడుకల్లో కనిపించిన ఈ భామ.. మరీ బక్కగా అయిపోయింది. సైజుల సంగతి పక్కన పెడితే.. ఇలా చిక్కిపోవడం కారణంగా మొహంలో కళ కూడా మాయమైపోయింది. కాజల్ ని ఇలా చూసిన అభిమానులు.. మా చందమాకు ఏమయ్యింది అని వాపోతున్నారు.

అన్నట్లు ఆటా వేడుకల్లో కనిపించిన పెద్ద హీరోయిన్ కాజల్ ఒకత్తే కావడం విశేషం. సమంత, తమన్నా లాంటి స్టార్ సుందరీమణులెవరూ కనిపించకపోవడంతో.. ఆటాలో బాగానే ఆధిపత్యం చూపించింది. అయితే.. వాళ్లు 30 లక్షలు అడిగారనే పిలవలేదన్న నిర్వాహకులు.. మరి కాజల్ కి ఎంతిచ్చి పిలిపించుకున్నారో అనే టాక్ వినిపిస్తోంది.