Begin typing your search above and press return to search.

మంచు కొండలకు చేరుకున్న కాజల్‌

By:  Tupaki Desk   |   25 March 2016 4:33 AM GMT
మంచు కొండలకు చేరుకున్న కాజల్‌
X
అప్పట్లో అవి గబ్బర్‌ సింగ్‌ రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసిన రోజులు. సినిమా ఆడియో రిలీజైంది. కాని రెండు పాటల షూటింగ్‌ మాత్రం పూర్తి కాలేదు. తన కొరయోగ్రాఫర్లతో కలసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మంచు కొండలకు చేరుకున్నాడు. శృతి హాసన్‌ కూడా వచ్చేసింది. పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి దిగాడు. గ్యాప్‌ లేకుండా రెండు పాటలను చకచకా పూర్తి చేసేశారు. ఇండియా వచ్చేశారు. పాటలను ఎడిట్‌ చేసేశారు. వెంటనే సినిమా రిలీజ్‌. ఆ పాటల్లో స్టెప్పులూ.. స్లో మూమెంట్లు.. శృతి అందాలు.. సూపర్‌. సరిగ్గా ఇప్పుడు కూడా ఇదే రిపీట్‌ అవుతోంది.

ఆ మంచు కొండలు ఉన్నాయే.. అవి స్విట్జర్ల్యాండ్‌ దేశంలో ఉన్నాయి. ఇంటర్లేకెన్‌ అనే నగరంలో అప్పట్లో షూట్‌ చేశారు. ఇప్పుడు కూడా ''సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'' పాటలను షూట్‌ చేయడానికి అక్కడికే చేరుకున్నారు సర్దార్ టీమ్‌. అయితే ఈసారి హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కాబట్టి.. అమ్మడు కూడా అక్కడికి దిగిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ కూడా చేరుకున్నాడట. ఓ నాలుగు రోజుల పాటు అక్కడే రెండు పాటల షూటింగ్‌ పూర్తి చేసుకొని తిరిగొస్తారట. వచ్చాక యాజూజువల్‌.. టకటకా ఎడిటింగ్‌ చేసి సినిమాలో ఈ పాటలను కలిపి రిలీజ్‌ చేస్తారు.

అదిగో ఇంటర్లేకెన్‌ నగరం నుండి కాజల్‌ హాయ్‌ చెబుతోంది.. మీరు కూడా ఒక హాయ్‌ చెప్పుకోండి. ఏప్రియల్‌ 8న సర్దార్‌ రిలీజవుతోంది.