Begin typing your search above and press return to search.
చందమామ కొత్త బిజినెస్!
By: Tupaki Desk | 9 July 2019 4:44 AM GMTదీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విషయాన్ని ఇప్పటి నటీనటులకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఓపక్క సినిమాలు.. మరోపక్క వాణిజ్య ప్రకటనలు.. ఇంకోపక్క ఓపెనింగ్ లు.. ఇవి కాక మరిన్ని పనులతో బిజీబిజీగా ఉండే నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగుతెర మీద సుదీర్ఘ కాలంగా నటిగా రాణించిన అతి కొద్దిమంది నటీమణుల్లో కాజల్ ఒకరు.
ఇటీవల సీతగా వెండితెర మీద మెరిసిన ఆమె తాజాగా కొత్త బిజినెస్ లోకి ఎంటరైంది. ఇప్పటికే పలువురు నటీమణులు సినిమాలు చేస్తూనే.. తమకున్న ఇమేజ్ ను వ్యాపారాలకు మళ్లిస్తున్నారు. ఇందులో భాగంగా కాజల్ తాజాగా ముంబయిలో నగల వ్యాపారాన్ని షురూ చేశారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును వేర్వేరు రంగాల్లో పెట్టుబడుల రూపంలో పెడుతున్న ఈ తరం నటీమణులకు కాజల్ ఒక ఉదాహరణగా చెప్పాలి.
పలువురు నటీమణులు చేస్తున్న వ్యాపారాల్లో లాభనష్టాలు పక్కా. కానీ.. లాభం తప్పించి నష్టమంటూ లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అదొక్క బంగారం వ్యాపారం మాత్రమే. ఈ విషయాన్ని గుర్తించిన కాజల్ తాజాగా బంగారం షాపును ప్రారంభించారు. అదే సమయంలో నిర్మాతగా మారిన వైనం చూస్తే.. ఒక్కతే ఇన్నింటిని ఎలా మేనేజ్ చేస్తుందన్నది ఒకపట్టాన అర్థం కాదు.
ప్రస్తుతం 36 ఏళ్ల కాజల్ కు ఈ ఏడాది ఎలా అయినా పెళ్లి చేయాలన్న పట్టుదలతో ఆమె తల్లిదండ్రులు ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఆమె సోదరి.. కొన్ని సినిమాల్లో నటించిన నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని ఒక బాబుకు తల్లి కావటం తెలిసిందే. పెళ్లి గురించి పెద్దగా రియాక్ట్ కాని కాజల్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా? అన్నది క్వశ్చనే.