Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చంద‌మామ చీర‌క‌ట్టు ఛ‌మ‌క్కులే

By:  Tupaki Desk   |   26 May 2020 4:15 AM GMT
ఫోటో స్టోరి: చంద‌మామ చీర‌క‌ట్టు ఛ‌మ‌క్కులే
X
చంద‌మామ అందాన్ని ఏమ‌ని వ‌ర్ణించాలి. మ‌చ్చ‌లేని చందమామ‌కు మ‌రు రూపంలా ఉందీ భామ‌. పాక్షికంగా అందాల్ని ఎర‌వేస్తూ చీర‌ను ఇంత అందంగా ఒంటికి అల్లేయ‌వ‌చ్చా? అన్నంత‌గా ఎంత అందంగా మేక‌ప్ అయ్యింది? సొగ‌స‌రి అందాన్ని పూల‌ తీగ అల్లుకున్న చందంగా ఆ చీర ఎంత ఒద్దికగా కుదిరిందో క‌దూ!

పింకు బ్లౌజు.. కాంబినేష‌న్ వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ అంచు.. ఆ బాట‌మ్ మొత్తం క‌వ‌ర్ చేస్తూ ఉన్న చ‌క్క‌ని ప్ర‌కృతి క‌ళాకృతి.. ఆహా అనిపించ‌డం లేదూ? ఎర్ర ఎర్ర‌ని పూలు.. షైనీ బ్లూ ఆకులు రెమ్మ‌లు ఆహా అనిపిస్తున్నాయ్. స్ట‌న్నింగ్ డిజైన‌ర్ లుక్ ఇది!.. కాజ‌ల్ కోస‌మే ఈ డిజైన్ ని రూపొందించారా? అన్నంత‌గా ఇది సెట్ట‌య్యింది. ఎన్నిర‌కాల చీర‌ల్ని డిజైన్ చేసినా కానీ.. ఇంత అద్భుత‌మైన డిజైనర్ చీర‌ను రూపొందించ‌డం అరుదుగానే సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

కాజ‌ల్ కెరీర్ సంగ‌తిచూస్తే.. లాక్ డౌన్ కార‌ణంగా చంద‌మామ కాజ‌ల్ న‌టిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2 వాయిదా ప‌డింది. ఎన్నో ఇబ్బందుల్లో ప్రారంభ‌మై .. ఊహించ‌ని లాక్ డౌన్ల‌తో అల్లాడింది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ నేప‌థ్యంలో ఈ సినిమా పూర్త‌వుతుందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మరోవైపు కాజ‌ల్ న‌టించిన పారిస్ పారిస్ (క్వీన్ రీమేక్) రిలీజ్ కి నోచుకోకుండా పెండింగులో ఉంది. వీట‌న్నిటి న‌డుమా రిలీఫ్ కోసం మంచు విష్ణుతో ఓ హాలీవుడ్ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా స‌న్నివేశం ఏమిటో తెలియాల్సి ఉందింకా.