Begin typing your search above and press return to search.

కాకినాడలో కాజల్.. ఏం చేసిందంటే..

By:  Tupaki Desk   |   3 Feb 2017 6:55 PM GMT
కాకినాడలో కాజల్.. ఏం చేసిందంటే..
X
కాజల్ అగర్వాల్ ఇప్పుడు టాప్ గేర్ లోకి వచ్చేసింది. ఏడాదిన్నర క్రితం చందమామ కెరీర్ డౌన్ అయిపోయింది అనుకుంటున్న టైంలో.. వరుసగా పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులు ఛాన్స్ లు ఇచ్చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవంలు నిరాశపరిచినా.. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఖైదీ నంబర్ 150 మూవీ ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం.. చిరంజీవితో అమ్మడు డ్యాన్సులతో కుమ్మేయడంతో.. మళ్లీ టాప్ రేంజ్ లోకి వచ్చేసింది కాజల్.

ఇటు ఛారిటీ ప్రోగ్రామ్స్.. అవగాహనా కార్యక్రమాల్లోనూ కాజల్ నాలుగు అడుగులు ముందే ఉంటుంది. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సడెన్ గా దర్శనం ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇదేమీ సినిమా ప్రమోషన్ కోసమో షూటింగ్ కోసమో కాదు.. క్యాన్సర్ బాధితుల కోసం కాకినాడలో ఓ అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అందరినీ ఆశ్చరపరిచింది చందమామ.

చాలా సింపుల్ డ్రెసింగ్ తో.. మేకప్ విషయంలో చిన్నపాటి టచప్ లు తప్ప మరేమీ లేకుండా.. ప్లెయిన్ గా దర్శనమిచ్చింది కాజల్. వైట్ ప్యాంట్.. బ్లూ స్ట్రైప్స్ టాప్ తో చాలా కేజువల్ గా ఉంది కాజల్ అగర్వాల్. చందమామ ఛారిటీ ఈవెంట్స్ లో పాల్గొంటుంది కానీ.. ఇంత ఓపెన్ గా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి.. చాలామందికి స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పాలి.