Begin typing your search above and press return to search.
కొడుకుని చూసి మురిసిపోతున్న కాజల్ అగర్వాల్
By: Tupaki Desk | 19 Jan 2023 1:20 PM GMTసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి జరిగి రెండేళ్ళు దాటితుంది. 2020లో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాలు అయితే ఇప్పటి వరకు చేయలేదు. ఒక్క శంకర్ దర్శకత్వంలో కమల్ హసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ మాత్రమే చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే గత ఏడాది కాజల్ అగర్వాల్ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇక తన కొడుకు పేరు నీల్ అని పేరు పెట్టింది. ఇక కొడుకు పుట్టిన తర్వాత ఆమె సెలబ్రిటీ అనే బ్రాండ్ ని పక్కన పెట్టి మాతృత్వాన్ని ఆశ్వాదిస్తున్న సంగతి తెలిసిందే.
రెగ్యులర్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా కొడుకుతో ఆడుకుంటూ తీసుకున్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తల్లి ప్రేమని చాటుతూ ఎంతగా తనతో గడిపే సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది అనేది చెప్పకనే చెబుతుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా తన కొడుక్కి 9 నెలలు పూర్తయ్యాయనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. కొడుకుని ఎత్తుకొని అలాగే చూస్తూ మురిసిపోతుంది. ఈ ఫోటో షేర్ చేస్తూ దానికి. భవిష్యత్తులో దేవుడు నీతో చేయించి అన్ని పనులు చూడటానికి ఈ క్షణం నుంచే వేచి ఉండలేను. నీతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆశ్వాదిస్తూ భగవంతుడుకి థాంక్స్ చెప్పుకుంటాను. తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలియజేసింది.
కొడుకుతో కలిసి దిగిన ఈ ఫోటోకి కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ గత కొంత కాలంలో మళ్ళీ సినిమాలలో బిజీ కావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపధ్యంలో ఫోటోషూట్ లతో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. సౌత్ లో ఈ బ్యూటీ సరైన కథల కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ కథలలో కూడా నటించడానికి కాజల్ అగర్వాల్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.