Begin typing your search above and press return to search.
కాజల్ నవ్వుకి సల్మాన్ ఫిదా
By: Tupaki Desk | 27 Dec 2017 4:14 PM GMTవయసు ఎంత పెరిగినా ఏ అమ్మాయికైనా నచ్చే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సల్మాన్ ఏ ఏజ్ లో ఉన్న హీరోయిన్ కైనా కరెక్ట్ జోడి అనేలా కెమిస్ట్రీ ని నడిపిస్తాడు. ఇక యువకుడీలా కనిపించే ఈ బ్రహ్మచారి వయసు ఎంత పెరుగుతున్న పెళ్లి అనే మాట ఎత్తడం లేదు. ఈ రోజుతో కండల వీరుడు వయస్సు 52 దాటింది. అయిదు పదుల వయసొచ్చినా కూడా ఫిట్ నెస్ లో సల్మాన్ ఏ మాత్రం తేడా రాకుండా చూసుకుంటున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది తారలు విషెస్ ని అందిస్తున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా సల్మాన్ తో దిగిన ఒక ఫోటోని జత చేస్తూ.. స్పెషల్ విషెస్ ని అందించింది. హ్యపీ బర్త్ డే మోస్ట్ ఛార్మింగ్ సాల్మన్ ఖాన్. మీరు ప్రతి పుట్టిన రోజును చాలా హ్యాపీగా జరుపుకోవాలని అలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కాజల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇక సల్మాన్ తో దిగిన ఫోటోని కూడా కాజల్ పోస్ట్ చేసింది. ఫొటోలో కాజల్ నవ్వుతూ ఉండడం చూసి సల్మాన్ ఆమె నవ్వుకు ఫిదా అయ్యి తను కూడా నవ్వేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక సల్మాన్ లేటెస్ట్ మూవీ టైగర్ జిందా హై సినిమా భారీ బాక్స్ ఆఫీస్ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితా కాజల్ మాత్రం సల్మాన్ తో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. ఇలా ట్వీటేసిందంటే.. అతగాడిని ఇంప్రెస్ చెయ్యడానికేనా??