Begin typing your search above and press return to search.

అఫీషియల్: శర్వాకు జోడీగా కాజల్

By:  Tupaki Desk   |   27 Nov 2017 11:46 AM GMT
అఫీషియల్: శర్వాకు జోడీగా కాజల్
X
యువ కథానాయకుడు శర్వానంద్ ఇప్పటిదాకా చిన్న.. మీడియం రేంజి హీరోయిన్లతోనే నటిస్తూ వచ్చాడు. తొలిసారిగా అతను ఒక స్టార్ కథానాయికతో జత కట్టబోతున్నాడు. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే కాజల్ అగర్వాల్.. శర్వాకు జోడీగా నటించబోతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో కాజల్ ఒక కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ కూడా నటించనుంది. నిత్య ఇప్పటికే శర్వాతో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’.. ‘రాజాధిరాజా’ సినిమాల్లో నటించింది. కాజల్ శర్వాతో నటించనుండటం ఇదే తొలిసారి. స్టార్ స్టేటస్ సంపాదించాక పెద్ద హీరోలతోనే నటిస్తూ వచ్చిన కాజల్.. ఈ మధ్య కొంచెం రేంజ్ తగ్గించుకుని రానా దగ్గుబాటి.. నందమూరి కళ్యాణ్ రామ్ ల పక్కన నటించింది. ఇప్పుడు శర్వాతోనూ జత కట్టేస్తోంది.

శర్వా-సుధీర్ సినిమాకు కాజల్ ఎక్కువ పారితోషకం అడగడంతో ఆమెకు టాటా చెప్పేశారని ప్రచారం జరిగినప్పటికీ అది అబద్ధమని తేలిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం సోమవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగానే ఈ చిత్రంలో నటించే కథానాయికల గురించి అధికారికంగా సమాచారం మీడియాకు ఇచ్చారు. ఈ చిత్రం ఒక గ్యాంగ్ స్టర్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.