Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అమ్మతనంను ఆస్వాదిస్తున్న కాజల్‌

By:  Tupaki Desk   |   11 Jun 2022 1:59 PM GMT
పిక్ టాక్‌ : అమ్మతనంను ఆస్వాదిస్తున్న కాజల్‌
X
కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం అమ్మతనంను ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్ గా సుదీర్ఘ కాలపై కెరీర్‌ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ ఇప్పడు అమ్మగా ప్రతి మూమెంట్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా ప్రస్తుతం సినిమాలు చేయకున్నా కూడా అమ్మగా రెగ్యులర్‌ గా ఫోటోలు షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

హీరోయిన్‌ గా కాజల్ అగర్వాల్ దక్కించుకన్న స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఇటీవల కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. గర్బవతి గా ఉన్న సమయంలో వరుసగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు కొడుకు ఫోటోలను ఫేస్ రివీల్‌ చేయకుండా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంది.

తల్లి అయిన తర్వాత కాజల్ మళ్లీ మునుపటి రూపంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కాజల్ అగర్వాల్‌ తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే వచ్చే ఏడాది ఆరంభం వరకు కాజల్‌ అగర్వాల్‌ కెమెరా ముందుకు వచ్చి సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ బలంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కాజల్ అగర్వాల్‌ తన కొడుకు క్యూట్‌ లెగ్‌ ను షేర్ చేసింది. ఆ లెగ్‌ కు నల్లపూసలతో ఒక లాకెట్‌ ను తయారు చేయించి దిష్టి హారం వంటిది పెట్టింది. ఆ ఫోటో ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కాజల్‌ అగర్వాల్ తనయుడి లుక్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఆచార్య లో ఉంటుందని అంతా ఎదురు చూశారు. కాని అనూహ్యంగా ఈ అమ్మడి పాత్రను సినిమా నుండి తొలగించారు. తద్వారా కాజల్‌ అభిమానులకు నిరాశ తప్పలేదు. నాగార్జున సినిమాలో కూడా ఎంపిక అయ్యింది.. కాని షూటింగ్‌ ఆలస్యం అవ్వడం... కాజల్ ప్రెగ్నెంట్‌ అవ్వడంతో ఆ సినిమాను కూడా మిస్‌ చేసుకుంది.