Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రచ్చ చేసి పారేసింది

By:  Tupaki Desk   |   9 April 2018 4:12 AM GMT
ఫోటో స్టోరి: రచ్చ చేసి పారేసింది
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు గ్లామర్ షో కొత్తేమీ కాదు. కాకపోతే గతంలో ఓ లిమిట్ వరకే ఈ ప్రదర్శన ఉండేది. కానీ ప్రస్తుతం యంగ్ జనరేషన్ నుంచి పెరిగిపోయిన పోటీ కారణంగా.. ఈ సుందరాంగి తన స్టైలింగ్ లో కూడా మార్పులు తీసుకొచ్చేసింది. క్లీవేజ్ షోకుల ప్రదర్శనకు కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు. కాకపోతే గతంలో ఈ ప్రదర్శనను కూడా బాలీవుడ్ కే పరిమితం చేసేది.

కానీ ఈ మధ్యన చందమామ అటెండ్ అయిన ఏ ఈవెంట్ అయినా సరే.. క్లీవేజ్ షో చేసి పారేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ జీ అప్సర అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు బ్లాక్ డ్రెస్ లో అటెండ్ అయిన కాజల్.. తన డ్రెసింగ్ మెరుపులతో పాటు.. అందాల షైనింగ్ కూడా బాగానే చూపించింది. కెమేరా ముందు ఏ మాత్రం మొహమాట పడకుండా సోయగాలతో రచ్చ చేసి పారేసింది. ఇలా కనిపించి అలా మాయమవడం మాత్రమే కాకుండా.. చిట్ చాట్ లలో కూడా అలాగే పాల్గొని అందాలతో చూపరులకు కనువిందు చేసింది.

ఇక యంగ్ హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్.. సుధీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ సినిమా విషయంలో మాత్రం సందేహాలు నెలకొనేలా చేసింది. కాజల్.. నిత్యా మీనన్ లను హీరోయిన్స్ గా ఎంచుకుంటే.. నిత్యను తొలగించి కళ్యాణి ప్రియదర్శన్ తో రీప్లేస్ చేశారు. కాజల్ డైరీ కూడా ఖాళీ లేకపోవడంతో.. ఈమె కూడా హ్యాండ్ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఎట్టకేలకు కాజల్ ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసిందని.. శర్వాతో జోడీ కట్టడం ఖాయమైందని తెలుస్తోంది.