Begin typing your search above and press return to search.

కాజల్ ఆంటీ అయింది!

By:  Tupaki Desk   |   22 Feb 2018 7:44 AM GMT
కాజల్ ఆంటీ అయింది!
X
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గుర్తుందా. ఏడేళ్ళ క్రితమే ఇండస్ట్రీకి వచ్చిన నిషా చేసిన మొదటి సినిమా ఏమైంది ఈ వేళ. సంపత్ నంది తీసిన ఈ సినిమా చూసే రామ్ చరణ్ అతనికి రచ్చ అవకాశం ఇచ్చి స్టార్ డైరెక్టర్ ని చేసేసాడు. ఆ తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన సోలో కూడా మంచి హిట్ అనిపించుకుని అందరికి లైఫ్ ఇచ్చింది. అందులో కూడా నిషానే హీరొయిన్. ప్రకాష్ రాజ్ కూతురిగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అంతే. ఆ రెండు తర్వాత నిషా అగర్వాల్ చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఒక పక్క అక్కయ్య దూసుకుపోతూ ఉంటే ఆ స్పీడ్ ను అందుకోలేక నిషా తప్పుకుంది. 2013లో వ్యాపారవేత్త కరణ్ వలెచాను ప్రేమ పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా మారిపోయింది.

ఇప్పుడు నిషా అగర్వాల్ తల్లైంది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కాజల్ ను పెద్దమ్మా అని పిలిచే బుడ్డోడిని కానుకగా ఇచ్చింది. ఈ విషయాన్నీ కాజల్ స్వయంగా ట్వీట్ చేస్తూ ఇషాన్ వలెచా అనే పేరుని కూడా తన అభిమానులకు పరిచయం చేసింది. బాబు నుదిటిపై ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసుకున్న కాజల్ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. నిద్ర లేని రాత్రిని తమకు కానుకగా ఇచ్చిన ఇషాన్ గురించి కాజల్ చెప్పిన మాటలు ఫాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

చెల్లికి పెళ్లి జరిగి ఐదేళ్ళు దాటుతున్నా కాజల్ మాత్రం తన పెళ్లి ముచ్చట ఎత్తడం లేదు. హీరొయిన్ గా కెరీర్ ఇంకా ఉంది కనక తొందరపడటం ఎందుకు అనుకుంటోంది కాబోలు. ఈ మధ్య అ! లో ఆకట్టుకున్న కాజల్ కొత్త సినిమా ఎమెల్యే(మంచి లక్షణాలున్న అబ్బాయి)విడుదలకు ముస్తాబవుతుండగా, తమిళ్ లో చేస్తున్న క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. ఇవి కాకుండా కొత్త సినిమాలేవీ కాజల్ ఇంకా సైన్ చేయలేదు.