Begin typing your search above and press return to search.
కాజల్ శుభవార్త: బుల్లి చందమామ పుడుతోంది
By: Tupaki Desk | 2 Jan 2022 3:57 AM GMTకాజల్ కబురు పంపింది. బుల్లి చందమామ పుడుతోందని అధికారికంగా ప్రకటించింది. ఆ మేరకు తన భర్త సోషల్ మీడియాల్లో అసలు విషయం చల్లగా చెప్పారు. కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు తమ మొదటి బిడ్డను 2022లో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రకరకాల ఊహాగానాల తర్వాత ఎట్టకేలకు ఈ జంట అన్నిటికీ చెక్ పెడుతూ వాస్తవాన్ని అంగీకరించారు. నూతన సంవత్సర సందర్భంగా అధికారికంగా మొదటి బిడ్డ జననంపై ధృవీకరించారు. గౌతమ్ తన సోషల్ మీడియాల్లో అందమైన భార్య చిత్రాన్ని పంచుకున్నాడు.
``ఇదిగో 2022 మీ కోసం చూస్తున్నాను`` అని వ్యాఖ్యను జోడిస్తూ.. దాని తర్వాత ఒక గర్భిణీ స్త్రీ ఎమోజీని షేర్ చేయడంతో అభిమానులకు పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్టయ్యింది. ఈ పోస్ట్ కాస్త గుంభనగా ఉన్నా క్లారిటీగానే అసలు విషయం బయటపెట్టారు గౌతమ్ కిచ్లు. ఇటీవలే వీరిద్దరూ తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వారు అక్టోబర్ 2020 లో ముంబైలో ఎంతో సింపుల్ గా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరువైపులా అతికొద్ది మంది బంధుమిత్రులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
అనంతరం కాజల్ అగర్వాల్ .. పెండింగ్ ఉన్న ఆచార్య చిత్రీకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ - శంకర్ ల భారతీయుడు 2 చిత్రీకరణలో పాల్గొన్నా కానీ అది మధ్యలో వివాదాలతో ఆగిపోయింది. ఇక కాజల్ నటించిన పలు చిత్రాలు త్వరలో విడుదలకు రానున్నాయి. నాగార్జున సహా పలువురు అగ్ర హీరోల సరసన అవకాశాలు వచ్చినా తొలి ఫ్రెగ్నెన్సీ కారణంగా కాజల్ వాటన్నిటి నుంచి అధికారికంగానే తప్పుకున్నారు.