Begin typing your search above and press return to search.
కాజల్ అలాంటి డెసిషన్ తీసుకుందా...?
By: Tupaki Desk | 17 July 2020 4:30 PM GMTసౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి మంచి టైమ్ నడుస్తోందని చెప్పవచ్చు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఓ వైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూనే మరోవైపు సినీయర్ హీరోలతో కూడా నటిస్తోంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే ఇప్పుడు కాజల్ ఇండస్ట్రీలో ఏర్పడిన క్రైసిస్ కారణంగా డేరింగ్ డెసిషన్ తీసుకుందట.
వివరాల్లోకి వెళ్తే గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అవడం వల్ల ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోయారు. ఫైనాన్స్ తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. రోజురోజుకి కరోనా తీవ్రత పెరగడం చూస్తుంటే మరికొన్ని నెలల పాటు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా కొన్ని నెలల పాటు రెవెన్యూ నామమాత్రంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు అండగా ఉండటానికి కోలీవుడ్ లో కొంత మంది హీరోహీరోయిన్లు.. డైరెక్టర్లు స్వచ్ఛందంగా రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో చందమామ కాజల్ అగర్వాల్ కూడా పారితోషకాన్ని తగ్గించుకోబోతోందట. ఇకపై తాను నటించబోయే సినిమాలకి రెమ్యూనరేషన్ తగ్గించుకోనున్నట్లు మేకర్స్ తో చెప్తోందట.
కాగా కాజల్ లాంటి వారు ముందుకొస్తే మిగతా హీరోయిన్స్ కూడా తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే ఆఫర్స్ కూడా వెతుక్కుంటూ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో అరడజనుకి పైగా ఆఫర్స్ ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. మంచు విష్ణు 'మోసగాళ్లు' చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ 'ఇండియన్ 2' మరియు 'హే సినామికా' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో 'ముంబయి సాగా' సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ లోనూ కనిపించనుందని సమాచారం. అంతేకాకుండా తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'అలమేలు మంగ వెంకటరమణ' సినిమాలో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి.