Begin typing your search above and press return to search.
మళ్లీ నా బాల్యం గుర్తొస్తుంది: కాజల్ అగర్వాల్
By: Tupaki Desk | 28 March 2020 8:50 AM GMTసౌత్ ఇండియన్ అందాల తార కాజల్ అగర్వాల్ ప్రస్తుతం దూరదర్శన్ ఛానల్ లో రామాయణం సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుందట. కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న కాజల్ అగర్వాల్ కూడా టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుందట. 'లాక్ డౌన్ సమయంలో రామాయణం చూస్తున్నా.. అని ట్వీట్ చేసింది.
ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దూరదర్శన్ చానెల్స్ లో రామాయణం, మహాభారతం సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది. "దూరదర్శన్ లో నాకెంతో ఇష్టమైన రామాయణం సీరియల్ ఫ్యామిలీతో కలిసి చూస్తున్నా. ఇది మా ఫ్యామిలీ వీకెండ్ ప్లాన్. రామాయణం మళ్లీ ప్రసారం అవుతున్నందుకు చాలా అనందంగా ఉంది. నాకు మళ్లీ నా బాల్యాన్ని గుర్తుచేసింది. ఈ జనరేషన్ పిల్లలు భారత పురాణాల గురించి ఇదొక గొప్ప మార్గం" అంటూ కాజల్ ట్వీట్స్ ద్వారా తెలిపింది. ఇంటికే పరిమితమైన ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో రామాయణం - మహాభారతం సీరియల్స్ ప్రసారం చేయడం చాలా మంచి నిర్ణయమని దేశ ప్రజలంతా భావిస్తున్నారు.