Begin typing your search above and press return to search.
చందమామను బందించేసిన మాంత్రికుడు!
By: Tupaki Desk | 18 July 2020 11:30 PM GMTమహమ్మారీ విలయం అంతకంతకు చాప చుట్టేస్తోంది. ముంబై-హైదరాబాద్ సహా అన్ని మెట్రోల్ని ద్వితీయ శ్రేణి నగరాల్ని అట్టుడికిస్తోంది. నిత్యం వేలాది కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రజలకు నోట మాట రావడం లేదు. అయితే ఇలాంటి స్థితిలో షూటింగులకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.
ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులు సెట్స్ కి వెళ్లకుండా వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. అయినా ప్రాణం అంటే ఎవరికి చేదు? ఇప్పుడు కథానాయికలు కూడా షూటింగులకు రాలేమని కరాఖండిగా చెప్పేస్తున్నారట. ఇలానే అయితే ఆదాయం ఎలా? కనీసం యాడ్ షూట్లతో వచ్చే ఆదాయం అయినా ఖాతాలో వేసుకోకపోతే ఖర్చులకు లిక్విడ్ క్యాష్ కష్టమే కదా?
అందుకే పలువురు కథానాయికలు భయపడుతూనే సెట్స్ కి వస్తున్నారట. వాణిజ్య ప్రకటనలే కాబట్టి వేగంగా నాలుగైదు రోజుల్లోనే షూట్లు పూర్తి చేసుకుని వెళ్లిపోవాలన్నది వారి ఆలోచన. ఇక ఇలాంటి వారిలో శ్రుతిహాసన్ .. ప్రియమణి.. రకుల్ ప్రీత్.. సహా పలువురు టాప్ రేంజ్ నాయికలు ఉన్నారు. వీళ్లతో పాటు తమన్నా.. కాజల్ లాంటి నాయికలు హైదరాబాద్ లో ప్రకటనల షూట్స్ కి ఎటెండవ్వాల్సి ఉందిట.
అయితే ఇతరులకు ఓకే కానీ కాజల్ కి తన తండ్రి నుంచి కొన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయట. తాను షూటింగులకు వెళతానంటే ఆయన వద్దనేస్తున్నారట. ఇక ముంబైలో చిత్రీకరణలు జరగాల్సినవి కూడా హైదరాబాద్ కి షిఫ్టవుతుండడంతో ఇక్కడికి వచ్చి షూటింగుల్లో పాల్గొనాల్సి ఉండగా కొందరికి ఇబ్బందులు తప్పడం లేదు.
అన్నపూర్ణ స్టూడియోస్.. రామానాయుడు స్టూడియోస్ సహా పలు చోట్ల పక్కా శానిటైజేషన్ తో మేకప్ రూమ్ లు బాత్రూమ్ లు వంటివి ఆర్టిస్టులకు అందుబాటులో ఉంటాయి. అలాంటి చోట అయితే ఓకే కానీ.. ఎక్కడపడితే అక్కడ షూటింగులు అంటే ససేమిరా అనేస్తున్నారట సదరు భామామణులు. కోవిడ్ 19 విషయంలో ఎవరికి వారు ఎంతో అలెర్ట్ గానే ఉంటున్నారనడానికి ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్స్ చూపించాలి? కాజల్ లాంటి నాన్నకూచీకి సమస్య వేరేగా ఉంది ఈ ఎపిసోడ్ లో.