Begin typing your search above and press return to search.
బ్రహ్మోత్సం.. బ్రాండింగ్ ఉత్సవం
By: Tupaki Desk | 4 Oct 2015 11:30 AM GMTచందమామ కాజల్ ప్లానింగే వేరు. ఈ అమ్మడు తెలివైన, గడుసైన సెలబ్రిటీ. దీపం ఉండగానే ఎలా చక్కదిద్దుకోవాలో తెలిసిన నాయిక. అందుకే దశాబ్ధం కెరీర్ ని నల్లేరుపై బండి నడకలా సాగించింది. స్టార్ హీరోలు - స్టార్ డైరెక్టర్స్ - స్టార్ ప్రొడ్యూసర్స్ మాత్రమే తన టార్గెట్. కోటానుకోట్లు పారితోషికంగా ముట్టజెప్పేవాళ్లే కావాలి. లేదూ కనీసం తన ఇమేజ్ ని పెంచే సినిమాలైనా అవతలివాళ్లు తీయాలి. ఇలా తెలివిగా కెరీర్ బండిని ప్లాన్ చేసుకునే టాలెంట్ ఏ ఇతర హీరోయిన్లలో లేదంటే అతిశయోక్తి కాదు.
ఇదిగో ఇక్కడ ఓ వైపు బ్రహ్మోత్సవం షూటింగు చేసేస్తోంది. మరోవైపు షాపుల ఓపెనింగులు - రిబ్బను కటింగులు అంటూ హల్ చల్ చేస్తూనే ఉంది. నిన్నటిరోజున ప్రఖ్యాత వస్ర్త దుకాణ సముదాయం నీరూస్ కొత్త షాపు ఓపెనింగుకి వెళ్లింది. ఏపీ టెంపరరీ రాజధాని విజయవాడలో మొట్టమొదటి షోరూమ్ ని లాంచ్ చేసింది. ఇక నుంచి కొత్త రాజధానిలో ప్రారంభమయ్యే ఏ షాపు ఓపెనింగు అయినా కాజల్ కి ఆతిధ్యం వస్తే వెళ్లిపోతుంది. అక్కడ షాపు ఓపెనింగ్ అవ్వగానే మళ్లీ షూటింగులో వాలిపోవడానికి అవసరమైన ప్రిపరేషన్స్ లోకి వచ్చేస్తుంది అమ్ముడు. అందాల చందమామ... వాటే ప్లానింగ్ ఓ భామా.