Begin typing your search above and press return to search.
కాజల్ ఆ బూతు కంటెంట్ సినిమా విడుదల కాబోతుందట!
By: Tupaki Desk | 25 July 2020 1:30 PM GMTబాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ చిత్రాన్ని సౌత్ లో తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇలా నాలుగు భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో తమన్నా హీరోయిన్ గా దట్ ఈజ్ మహాలక్ష్మి రూపొందగా తమిళంలో కాజల్ హీరోయిన్ గా ప్యారిస్ ప్యారిస్ టైటిల్ తో రీమేక్ అయ్యింది. తెలుగు కన్నడం మలయాళం భాషల రీమేక్ లకు సెన్సార్ వచ్చింది. కాని తమిళంలో మాత్రం సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. దాంతో నాలుగు భాషల్లో కూడా సినిమా విడుదల చేయలేదు.
ఇతర భాషలో సెన్సార్ క్లియరెన్స్ రాగా తమిళంలో మాత్రం ఎందుకు క్లియరెన్స్ రావడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు రమేష్ అరవింద్ కాస్త బూతు కంటెంట్ జోడివ్వడం వల్ల సెన్సార్ క్లియరెన్స్ రావడం లేదని టాక్ వినిపిస్తుంది. ట్రైలర్ లో కూడా కొన్ని అడల్ట్ సీన్స్ ఉండటం వల్ల విమర్శలు వచ్చాయి. కాజల్ అలాంటి సీన్స్ లో ఎలా నటించిందంటూ విమర్శలు కూడా వచ్చాయి. సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంపై గతంలో కాజల్ కూడా సెన్సార్ బోర్డు సభ్యులపై అసహనం వ్యక్తం చేసింది.
ఇన్నాళ్లు సెన్సార్ క్లియరెన్స్ కోసం చూసిన మేకర్స్ ఇక లాభం లేదని ఓటీటీ విడుదలకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఓటీటీలో విడుదలకు సెన్సార్‌తో సంబంధం లేదు. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రీమింగ్ మొదలు పెట్టవచ్చు అని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు భాషలకు చెందిన సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో ప్రముఖ ఓటీటీతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే కాజల్ ఆ బూతు కంటెంట్ మూవీ ‘ప్యారిస్ ప్యారిస్’ ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా రావడం ఖాయం అంటున్నారు.