Begin typing your search above and press return to search.

కాజ‌ల్ స‌డెన్ పెళ్లి వెన‌క అస‌లు కార‌ణం ఇదే

By:  Tupaki Desk   |   10 Oct 2020 11:10 AM GMT
కాజ‌ల్ స‌డెన్ పెళ్లి వెన‌క అస‌లు కార‌ణం ఇదే
X
చంద‌మామ కాజల్ స‌డెన్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. కాజ‌ల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లుని ఈ నెల 30 న వివాహం చేసుకోనున్న సంగ‌తి విధిత‌మే. ముంబైలో కొద్దిమంది బంధుమిత్రులు.. ఆత్మీయ అతిథుల స‌మ‌క్షంలో ఈ వివాహం జరుగుతుంది.

ముంబై మీడియా క‌థ‌నాల‌ ప్రకారం..ఈ వివాహానికి వంద కంటే తక్కువ మంది హాజరవుతారు. లొకేషన్ నుండి అన్ని ఏర్పాట్ల వరకు కాజల్ స్వ‌యంగా ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి ఈ సంవత్సరం కాజల్ ‌కు పెళ్లి చేసుకునే ప్లాన్ లేక‌పోయినా.. లాక్‌డౌన్ వ‌ల్ల‌ అవన్నీ మారిపోయాయ‌ట‌. ఈ తీరిక వేళ‌లోనే తన కుటుంబంతో చ‌ర్చించి ఒక్కొక్కటిగా ప్ర‌ణాళికలు వేసుకుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నెలాఖ‌రుకి పెళ్లి అయిపోయాక‌.. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా కాజ‌ల్ బిజీగానే ఉండ‌నుంది. అటు క‌మ‌ల్ హాస‌న్ తో భార‌తీయుడు 2 మూవీని పూర్తి చేయాల్సి ఉండ‌గా.. ఇటు మెగాస్టార్ ఆచార్య కోసం కాల్షీట్ల‌ను కేటాయించింది. మ‌రోవైపు ఇత‌ర స్క్రిప్టుల విష‌యంపైనా ఫైన‌ల్ గా మాట ఇవ్వాల్సి ఉంద‌ట‌.