Begin typing your search above and press return to search.

గిరిజనులకు స్కూల్ కట్టించి ఇంగ్లీష్ నేర్పిస్తున్న కాజల్.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   19 Jun 2020 10:10 AM GMT
గిరిజనులకు స్కూల్ కట్టించి ఇంగ్లీష్ నేర్పిస్తున్న కాజల్.. ఎక్కడంటే?
X
కెరీర్లో చాలా కస్టపడి స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం దాటినా ఇంకా టాప్ హీరోయిన్ గానే రాణిస్తోంది. అయితే కాజల్ ఎంత అందంగా ఉంటుందో.. అంతే అందమైన మనసు కూడా కలిగి ఉందని నిరూపిస్తుంది. ఎందుకంటే ఏమి చేయకుండానే పబ్లిసిటీ కోరుకునే ఈ రోజుల్లో కాజల్ ఓ గ్రామానికి.. ఎంతో చేసి కూడా పబ్లిసిటీ కోరుకోలేదు. తను సహకరించగలను అని నమ్మి ఏకంగా ఒక గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి పిల్లల కోసం ఏకంగా ఒక స్కూల్ కట్టించింది కాజల్. అవును అంత పెద్ద మనసా.. మరి ఇంతకాలం ఎందుకు బయటికి తెలియలేదు అంటే నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదని చెప్పుకొస్తుంది ఈ బర్త్డే బ్యూటీ. ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో ఎన్నో భారీ హిట్లు రుచి చూసింది. నటిగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఎవరికి చెప్పకుండా అరకు గిరిజనుల అభివృద్ధి కోసం కాజల్ ముందడుగు వేసింది. ఆ గిరిజనులకు బాసటగా నిలవడం కోసం.. మనమంతా కలిసి గిరిజనులకు అండగా నిలుద్దాం.. ప్రతిభావంతులైన గిరిజనులకు పోషకాహారం అందేలా.. క్రీడా వసతులు మెరుగయ్యేలా సాయం చేద్దామని కాజల్ గతంలోనే చెప్పింది. అయితే మూడో కంటికి తెలియకుండా అరకు వ్యాలీలోని గిరిజన పిల్లల‌కు కాజల్ సేవలందిస్తుంది. థింక్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తున్న కాజల్.. అరకు లోయలో ఓ పాఠశాల భవనం కట్టించింది. అంతేగాక అక్కడి పిల్లలకు చదువుతో పాటు ఇంగ్లిష్ నేర్పిస్తుందట. ఇక అన్నీ వసతులతో పాటు శానిటేషన్, మధ్యాహ్న భోజనం కూడా సమకూరుస్తుందట. తరచుగా షూటింగ్‌లకు కోసం అరకు వెళ్లడంతో.. ఆ ప్రాంతంతో అనుబంధం ఏర్పడిందని.. అందుకే వారికి తోచిన సాయం చేస్తున్నానని కాజల్ చెప్పింది. కాజల్ నిజంగానే అందమైన మనసున్న హీరోయిన్ అంటూ అభిమానులు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.