Begin typing your search above and press return to search.

సమంత-కాజల్‌ అక్కడ దొరికిపోతున్నారు

By:  Tupaki Desk   |   15 May 2016 11:30 AM GMT
సమంత-కాజల్‌ అక్కడ దొరికిపోతున్నారు
X
ఇప్పుడు టాపిక్‌ అంతా.. అసలు సమంత అండ్‌ కాజల్‌ మధ్యన ఎలాంటి గొడవ జరిగింది? ఎందుకు వీరు ఒకరితో ఒకరు కాస్త ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారు అనేది. మొన్న ఒక చెప్పులు షాపుకు వచ్చిన వీరిద్దరూ ఎంతో హ్యాపీగా మాట్లాడుకోవడం చూశాం. కాని ఇప్పుడేంటి ఇలా కాస్త షేకింగ్‌ అండ్‌ స్టన్నింగ్‌ గా చెబుతున్నారు అనుకుంటున్నారా.. పదండి అదే చూద్దాం.

హైదరాబాద్‌ లో ఒక పోష్‌ హోటల్‌ లో ఇప్పుడు బ్రహ్మోత్సవం టీమ్‌ అంతా గత రెండు రోజులుగా ఇంటర్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్‌ బాబుతో కాజల్‌ కలసి కనిపిస్తోంది.. లేదంటే సమంత.. కాని ఇద్దరూ కనిపించడం లేదు. ఇక సమంతను ఇంటర్యూ ను చేస్తున్నప్పుడు అక్కడకు కాజల్‌ రాగా.. సమంత కాస్త ఇబ్బందిగా ఫీలైంది. హాయ్‌ బాయ్‌ లు చెప్పుకున్నారు కాని.. ఏదో తెలియన అన్‌ ఈజీ ఫీలింగ్‌ వారి మధ్యన ఉందని.. అక్కడే ఉన్న జోర్నోలకు ఇట్టే అర్ధమైపోయింది. అలాగే కాజల్‌ ను ఇంటర్యూ చేసినప్పుడు కూడా.. సమంత గురించి అడిగితే.. ఇక సింగిల్‌ లైన్‌ లో చెప్పేసి.. తదుపరి క్వశ్చన్‌ చెప్పండి అనేసింది.

కేవలం సమంత తనకంటే వెనకొచ్చి.. తనకంటే పెద్ద స్టార్‌ అయిపోయిందని కాజల్‌ ఫీలవుతోందా? లేకపోతే బ్రహ్మోత్సవం సినిమా విషయంలో ఏదైనా గొడవ జరిగిందా? లేదంటే ఈ సినిమాలో కాజల్‌ ను హైలైట్‌ చేసి తనను పక్కనెట్టారని సమంత ఫీలైందా? ఏదో మాత్రం జరిగింది.