Begin typing your search above and press return to search.
భర్త కోసం కాజల్ విజ్ఞప్తులు
By: Tupaki Desk | 16 Nov 2021 5:57 AM GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె నటించింది. దశాబ్ద కాలం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ త్వరలో తన భర్త గౌతమ్ కిచ్లూను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంతో మంది అరంగేట్రం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్స్ సోదరులను లేదా సోదరిని పరిచయం చేయడమే ఇప్పటి వరకు చూశాం. కాని మొదటి సారి హీరోయిన్ భర్త ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి అయిన గౌతమ్ కిచ్లూ ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. చూడ్డానికి బాలీవుడ్ హీరోలా ఉన్న గౌతమ్ కిచ్లూ అందరికి నచ్చాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్న గౌతమ్ కిచ్లూ ను సినిమాల్లో నటింపజేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని.. జనాలు గౌతమ్ కిచ్లూను ఆధరించి అభిమానిస్తారని కాజల్ భావిస్తుందట. గౌతమ్ కు కూడా నటన పై ఆసక్తి ఉండటంతో ఆమెతో ఇప్పటికే ఒక ప్రమోషనల్ వీడియోలో నటించాడు. ఇంతకు ముందు నటన లో గౌతమ్ కిచ్లూ శిక్షన కూడా తీసుకున్నాడు అనేది టాక్.
ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ మరియు నిర్మాతలతో కాజల్ అగర్వాల్ తన భర్త గురించి చర్చిస్తుందట. తన భర్తకు సినిమాల్లో ఏదైనా పాత్రను ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిందట. హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కిచ్లూ తో చేయించి ఆ తర్వాత హీరోగా పరిచయం చేయాలని కాజల్ భావిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా తన వద్దకు వస్తున్న సినిమాలను కాదనడంతో పాటు... ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా వదిలేసింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయమై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాజల్ ఇండస్ట్రీకి మెల్ల మెల్లగా దూరం అవుతున్న ఈ సమయంలో గౌతమ్ కిచ్లూను పరిచయం చేసేందుకు సిద్దం అవ్వడం జరుగుతుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరి కాజల్ ఇమేజ్ తో ఇతడికి ఏ మేరకు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కుతుంది అనేది చూడాలి.