Begin typing your search above and press return to search.

చంద‌మామ అప్పుడే పేరు కూడా పెట్టేసింది

By:  Tupaki Desk   |   20 April 2022 10:37 AM GMT
చంద‌మామ అప్పుడే పేరు కూడా పెట్టేసింది
X
అందాల‌ల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న చిర‌కాల మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో గ‌త ఏడాది ఈ ప్రేమ జంట పెళ్లి పీట‌లెక్కింది. క‌రోనా కార‌ణంగా కాజ‌ల్ పెళ్లిలో ఇరు కుటుంబాల‌కు చెందిన కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. అప్ప‌టి నుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజ‌ల్ తాజాగా అంటే మంగ‌ళ‌వారం పండంటి మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది.

త‌ను ప్రెగ్నెంట్ అన్న విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్న కాజ‌ల్ అప్ప‌టి నుంచి త‌న ప్ర‌తీ స్టెప్ ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ వ‌స్తోంది. బేబి బంప్ తో ద‌ర్శ‌న‌మిచ్చిన కాజ‌ల్ ప్రెగ్నేన్సీ స‌మ‌యంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ప్ర‌త్యేక ట్రైన‌ర్ స‌హ‌యంతో చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోల‌ని, ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంటూ వ‌చ్చింది. ఏప్రిల్ 19న ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ లో పండంటి బాబుకు జ‌న్మనిచ్చింది.

అయితే అభిమానులు మాత్రం కాజ‌ల్ త‌న‌యుడి ఫోటో ఎప్పుడెప్పుడు చూపిస్తుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే బుధ‌వారం కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ త‌మ ముద్దుల త‌న‌యుడికి పేరు కూడా పెట్టేశారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని కూడా షేర్ చేయ‌డం విశేషం. త‌మ త‌న‌యుడికి 'నీల్ క‌చ్లూ' అని నామ‌క‌రం చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించేశాడు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్ ని కూడా అభిమానుల‌తో పంచుకున్నారు.

మా హృద‌యాల‌న్నీ కృత‌జ్ఞ‌తాభావంతో నిండిపోయాయ‌ని, ఈ సంద‌ర్భంగా మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌ల‌ని తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం కాజ‌ల్‌, పుట్టిన బాబు క్షేమంగా వున్నార‌ట‌. త్వ‌ర‌లోనే హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేర‌నున్నార‌ని తెలిసింది.

త‌న సోద‌రికి బాబు జ‌న్మించాడ‌ని నిషా అగ‌ర్వాల్ ఆనందంతో పొంగిపోతోంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం మా ప్ర‌పంచాన్ని మ‌రింత అందంగా మార్చే వ్య‌క్తికి వెల్క‌మ్ చెప్పాం. ఈ వార్త విని చాలా థ్రిల్ అయ్యాం కూడా' అని చెప్పుకొచ్చింది.

పుట్టిన మ‌రుస‌టి రోజే పేరు నిర్ణ‌యించ‌డం, ఇందుకు సంబంధించిన పోస్ట్ ని గైత‌మ్ కిచ్లూ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన చిత్రం 'ఆచార్య‌'. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి కాజ‌ల్ న‌టించిన రెండ‌వ చిత్ర‌మిది. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.