Begin typing your search above and press return to search.

కిస్సు గురించి కాజల్ కొత్త కహానీ

By:  Tupaki Desk   |   21 May 2016 10:11 AM GMT
కిస్సు గురించి కాజల్ కొత్త కహానీ
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో లిప్ లాక్ చేయడం సెన్సేషన్ అయింది. ఆ కిస్సింగ్ సీన్ కంటే ఎక్కువగా.. దాన్ని ప్రచారం చేసుకున్న తీరు మరీ దారుణంగా ఉంది. దో లఫ్జోంకీ కహానీ మూవీ షూటింగ్ టైంలో.. రొమాంటిక్ సీన్ తీస్తున్నపుడు కాజల్ కి రణ్ దీప్ హుడా సడెన్ గా ముద్దు పెట్టేశాడని.. దీంతో కాజల్ అలిగి వెళ్లిపోయిందని యూనిట్ వర్గాలే స్వయంగా చెప్పాయి.

ఇప్పుడు కాజల్ ఈ లిప్ లాక్ సీన్ పై కొత్త వెర్షన్ వినిపిస్తోంది. 'ఆ ముద్దు సీన్ స్క్రిప్ట్ లో ముందే ఉంది. గుడ్డి అమ్మాయి తన ప్రేమను చెప్పడానికి కేవలం మాట - స్పర్శ మాత్రమే ఆధారం. అబ్బాయిని కనీసం చూడలేని ఆ పాత్ర.. తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి ముద్దు పెట్టడం కంటే వేరే దారి ఉండదు' అని చెప్పింది కాజల్. ఈమె చెబుతున్న ప్రకారం.. లిప్ కిస్ సీన్ ఉంటుందని తెలిసినదే. అంటే కావాలనే ఆ ముద్దు పెట్టిందన్న మాట.

యూనిట్ వర్గాలు మాత్రం ప్రచారం కోసం అలా చెప్పేశాయని అర్ధమైపోతోంది. గతంలో కూడా కాజల్ ఇలాగే తన టాప్ లెస్ ఫోటోలపై రెండు రకాల మాటలు చెప్పి దొరికిపోయింది. కాజల్ తో టాప్ లెస్ ఫోటో షూట్ చేసిన ఆ మేగజైన్.. మార్ఫింగ్ ఫోటోల కామెంట్స్ పై లీగల్ నోటీసులు అనేసరికి.. తనే చేసినట్లు ఒప్పుకుంది. ఇప్పుడు ముద్దు సీన్ తనకు తెలుసని ఆలస్యంగా చెప్పింది. ప్రచారం కోసం ఇలా చేయడం చీప్ ట్రిక్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వింటున్నావా చందమామా!!