Begin typing your search above and press return to search.

ఆ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో కంగారు పెట్టిన కాజ‌ల్

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:27 AM GMT
ఆ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో  కంగారు పెట్టిన కాజ‌ల్
X
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమ వివాహం గురించి తెలిసిందే. త‌న స్నేహితుడు కం బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. అస‌లు కాజ‌ల్ పెళ్లాడే మూడ్ లో లేదు అనుకుంటుండ‌గానే స‌డెన్ షాకిచ్చింది. ఇంత‌లోనే ఈ ఏడాది ఏప్రిల్ లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజ‌ల్ రీఎంట్రీ ఎప్పుడు? అన్న ప్ర‌శ్న‌కు ఇన్నాళ్లు క్లారిటీ లేదు. ఎట్ట‌కేల‌కు పున‌రారంగేట్రంపై కాజ‌ల్ త‌న నిర్ణ‌యాన్ని స్వయంగా ప్రకటించింది.

శంక‌ర్ - క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో భార‌తీయుడు 2 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే కాజ‌ల్ సెట్స్ కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల వివాదాల‌తో ఈ మూవీ వాయిదాల ఫ‌ర్వంలో ఉండ‌గా కాజల్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు కాజ‌ల్ రీఎంట్రీ అంటూ ప్ర‌క‌టించ‌గానే తిరిగి భార‌తీయుడు 2 కి లైన్ క్లియ‌రైంద‌ని అర్థ‌మ‌వుతోంది. కాజ‌ల్ భార‌తీయుడు 2 సెట్స్ కి వెళుతున్నాన‌ని కూడా ప్ర‌క‌టించ‌గా అది ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ అభిమానుల్లో క‌ల‌త‌కు కార‌ణ‌మైంది. కొంతకాలంగా కాజల్ అగర్వాల్ తో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ప‌లు నిర్మాణ సంస్థ‌లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు అంద‌రికీ ఉత్సాహం తిరిగి వ‌చ్చిన‌ట్టే అన‌డంలో సందేహం లేదు.

తన అధికారిక ఇన్ స్టా సెషన్ లో కాజల్ అగర్వాల్ తాను భారతీయ 2 సెట్స్‌కు వ‌స్తున్నాన‌ని.. తన భాగం షూటింగ్ సెప్టెంబర్ 13న ప్రారంభమవుతుందని వెల్ల‌డించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌వుతుంద‌ని భార‌తీయుడు 2 నుంచి త‌న పాత్ర‌ను తొల‌గించార‌ని సాగిన ప్ర‌చారానికి ఎట్ట‌కేల‌కు కాజ‌ల్ స్వ‌యంగా చెక్ పెట్టింది. ర‌కుల్ తో పాటు కాజ‌ల్ కూడా ఈ మూవీలో ఒక భాగం.

చ‌ర‌ణ్ ఫ్యాన్స్ క‌ల‌త దేనికి?

అయితే కాజ‌ల్ రీఎంట్రీ గురించి ప్ర‌క‌టించ‌గానే రామ్ చ‌ర‌ణ్ అభిమానుల్లో క‌ల‌త మొద‌లైంది. నిజానికి `భార‌తీయుడు 2` కోర్టు వివాదాల్లో ఉండ‌గానే శంక‌ర్ ఆర్.సి 15 కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ మూవీని చ‌క‌చ‌కా పూర్తి చేస్తున్నారు. కానీ ఇంత‌లోనే భార‌తీయుడు 2 ని పూర్తి చేసేందుకు స‌యోధ్య కుదిరింది. ఇప్పుడు శంక‌ర్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ మూవీని కూడా పూర్తి చేయాల్సి ఉంది. కోర్టు కి ఇచ్చిన మాట ప్ర‌కారం.. జూలై నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో ఈ మూవీని తిరిగి ప‌ట్టాలెక్కించాల్సి ఉంద‌ని కూడా టాక్ ఉంది.

అందుకు శంక‌ర్ కూడా స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని స‌మాచారం. ఇప్పుడు కాజ‌ల్ ప్ర‌క‌ట‌న‌తో దీనిపై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. దీన‌ర్థం ఆర్.సి 15 ని పూర్తి చేయ‌కుండానే శంక‌ర్ భార‌తీయుడు 2 సెట్స్ కి వెళ‌తారా? అలా జ‌రిగితే ఆర్.సి 15 కి ఆటంక‌మే క‌దా? అనేది చ‌ర‌ణ్ అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

వివాదాల‌తో ఎప్ప‌టిక‌ప్ప‌డు నిలిచిపోతున్న భార‌తీయుడు 2 ని శంక‌ర్ ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? ఆర్.సి 15 పెండింగ్ షూట్ ఎప్ప‌టికి పూర్తి చేస్తాడు? అంటూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కాజల్ సెప్టెంబర్ 13న ఇండియన్ 2 (భార‌తీయుడు 2) కోసం సెట్స్ పైకి తిరిగి వస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇది రామ్ చరణ్ అభిమానులకు అంతగా నచ్చడం లేదు. ఆర్.సి 15 తో పాటు భార‌తీయుడు 2 ని కూడా ఒకేసారి షెడ్యూళ్లను ప్లాన్ చేసి దాని ప్ర‌కారం పూర్తి చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి.